Suryaa.co.in

Andhra Pradesh

మహానాడు ప్రతినిధుల సభకు అన్ని ఏర్పాట్లు

– ప్రతినిధుల కమిటీ కో కన్వీనర్ హరికృష్ణ

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పండగ అయిన మహానాడుకు వివిధ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని మహానాడు ప్రతినిధుల కమిటీ కో కన్వీనర్, ఐటిడిపి మాజీ కన్వీనర్ హరికృష్ణ వెల్లడించారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చే ప్రతినిధుల నమోదుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.

ముఖ్యంగా తెలంగాణ నుంచి వేలాదిమంది వస్తున్న టీడీపీ ప్రతినిధులకు, ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. దేశరాజకీయాలను నిర్దేశం చేసే మహానాడు కోసం కోటిమంది కార్యకర్తలతో పాటు, ప్రపంచంలోని తెలుగువారంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని హరికృష్ణ చెప్పారు.

LEAVE A RESPONSE