జనగామ జిల్లాలో 3 సీట్లు మనమే కైవసం చేసుకోవాలి
జనగామ BRS పార్టీ సమన్వయ సమావేశంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్, మంత్రుల నివాసంలో గల క్లబ్ హౌజ్ లో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జనగామ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, TSRTC చైర్మెన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రైతు బంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్యే డా. టి రాజయ్య, మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్ రావు, జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
వచ్చే ఎన్నికల్లో BRS పార్టీని జనగామ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో గెలిపించడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ నెల 16న జనగామలో నిర్వహించే ఎన్నికల మొదటి సభను విజయవంతం చేయాలని నాయకులకి విజ్ఞప్తి చేశారు.