– ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్
నిజాం తరహా పాలన రాకూడదని అనుకునే వాళ్లంతా కచ్చితంగా “రజాకార్” సినిమా చూడాలి. మతపరంగా “ముస్లిం”లకు రిజర్వేషన్లు కల్పించాలని అనుకునే వాళ్లంతా ఈ సినిమా చూసి బుద్ది తెచ్చుకోవాలి. చాకలి ఐలమ్మ తెగువ, గుండ్రంపల్లి పోరాటాల ను కళ్ళకు కట్టినట్లు రజాకార్ సినిమాలో చూపించారు. తెలంగాణ లోని ప్రతి ఒక్కరూ, ప్రతి హిందువు తప్పకుండా ఈ సినిమా చూడాలి
నిజాం సమాధి వద్ద మోకరిల్లి కేసీఅర్ “రజాకార్” సినిమా చూసి ట్వీట్ చేయాలి. రజాకార్ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సినిమా పై ట్వీట్ చేయండి. పాతబస్తీ లోని చార్మినార్ వద్ద ఓవైసీ సహా రజాకార్ల వారసులందరికీ అక్కడే ఈ సినిమా చూపించాలి. తెలంగాణ ప్రజల తెగువ, నిజాం నియంతృత్వం, రజాకార్ల రాక్షసత్వాన్ని కల్లకింకట్టినట్లు చూపించిన దర్శక, నిర్మాత, నటీనటులకు హ్యాట్సాఫ్…