– భక్తులు క్యూ లో ఉండగా.. క్యూ లైన్లోకి నీరు
తిరుపతి: ఒకవైపు ఏపీలో ఎండలు మండిపోతుంటే.. తిరుమలలో మాత్రం ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారింది. తిరుమలలో ఇవాళ(గురువారం) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.. భారీ వర్షం కారణంగా.. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ ఉండగా.. క్యూ లైన్లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.