Suryaa.co.in

Andhra Pradesh

ఇవేం ఉత్తర్వులు?

-గంగిరెడ్డి బెయిల్‌ రద్దు అంశంలో సీజేఐ చంద్రచూడ్‌ అసహనం
-హైకోర్టు తీర్పుపై తలపట్టుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు..

బెయిల్‌ రద్దు చేసి జూన్‌ 30 తర్వాత మళ్లీ బెయిల్‌ ఇవ్వాలని వెంటనే ఉత్తర్వులు ఇవ్వడంపై సీజేఐ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇవేం ఉత్తర్వులంటూ అసహనం వ్యక్తం చేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.

వివేకా హత్య కేసులో నిందితుడు (ఏ1) ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల షరతును ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. హంతకులు బయట ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సునీత పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణను వెకేషన్‌ బెంచ్‌కు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ వచ్చే వారం పిటిషన్‌పై విచారణ జరపనుంది..

LEAVE A RESPONSE