– సాక్షి పేపర్, సాక్షి ఛానెల్‌పై దావా వేస్తా
– సీఎంసీపీఆర్వో ఇచ్చిన తప్పుడు సమచారం వల్లే నాపై దుష్ప్రచారం
– సీఎస్ సమీర్ శర్మకు లేఖ కాపీ
– జీఏడీ కార్యదర్శికి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ
అమరావతి : జీఏడీ కార్యదర్శికి సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, సీపీఆర్వో పూడి శ్రీహరిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలని ఏబీవీ కోరారు. తన విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారంటూ చెవిరెడ్డి, శ్రీహరి సహా సాక్షి పేపర్, సాక్షి ఛానెల్‌పై దావా వేస్తానని ఆయన పేర్కొన్నారు.
సాక్షి పేపర్ ఎడిటర్ వర్దెల్లి మురళీపై దావా వేస్తానని ఆయన కోరారు. ఆరు పేజీల పవర్‌పాయింట్ ప్రజంటేన్ విడుదల చేశారని అభియోగం మోపినట్లు ఆయన తెలిపారు. తనపై పూడి శ్రీహరి ప్రచారం చేసిన విషయాలేవీ ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో లేవని ఏబీ ఆ లేఖలో స్పష్టం చేశారు. విచారణ సందర్భంలో కూడా తనపై జరిగిన దుష్ప్రచారంలోని అంశాల ప్రస్తావన లేదని ఏబీవీ పేర్కొన్నారు.
పూడి శ్రీహరి ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా తనపై మీడియాలో దుష్ప్రచారం జరిగిందని లేఖలో ఏబీవీ ఆవేదన వ్యక్తం చేశారు. తానే కాకుండా తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ కథనాలు బాధ కలిగించాయన్నారు. లేఖ కాపీని సీఎస్ సమీర్ శర్మకు ఏబీవీ పంపారు.