Home » అందమైన అమ్మాయికి అంబానీ అదిరిపోయే ఆన్సర్‌

అందమైన అమ్మాయికి అంబానీ అదిరిపోయే ఆన్సర్‌

రూ.100 కోట్ల వ‌రుడు కావాల‌న్న,అందమైన అమ్మాయికి ముఖేష్ అంబానీ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్

రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీకి త‌న సంస్థ‌కు సంబంధించిన పెద్ద మీటింగ్‌ల‌లో పాల్గొనే టైమే ఒక్కోసారి ఉండ‌దు.అంత బిజీగా ఉంటారు. ల‌క్ష‌ల కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేత అయిన ఆయ‌న సోష‌ల్ మీడియాలో త‌నకు సంబంధం లేని ఓ పోస్టుపై ఆయ‌న స్పందించడం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నం రేపుతోంది.
ఇంత‌కు పూజ అనే అమ్మాయి అడిగిన ప్ర‌శ్న‌కు ముఖేష్ ఎలాంటి స‌మాధానం ఇచ్చాడో చూద్దాం.

ఓ అందమైన యువతి…
తనకు సంవత్సరానికి రూ. 100 కోట్లు సంపాదించేవాడు భర్తగా రావాలని కోరుకుంది. తన కోరికను సామాజిక మాధ్యమాల ద్వారా నలుగురితో పంచుకుంది.
ఈ పోస్టును చూసి ముఖేష్ అంబానీ ఆ యువ‌తికి దిమ్మ‌తిరిగేలా ఆన్స‌ర్ ఇచ్చాడు.
ఈ ఆన్స‌ర్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది యువ‌త‌ను ఆలోచించేలా చేస్తోంది.
ఆ యువ‌తి ప్ర‌శ్న‌-అందుకు ముఖేష్ అంబానీ ఆన్స‌ర్ ఇలా ఉన్నాయి.

ఆ యువతి పెట్టిన పోస్టు…

టైటిల్: నేను ధనవంతుడినే ఎందుకు పెళ్లి చేసుకోవాలి ?
నా వ‌య‌స్సు 25 సంవ‌త్స‌రాలు…నా పేరు పూజ చౌహాన్‌. నేను చాలా అందంగా ఉంటాను…నాకు చాలా మంచి అభిరుచులు ఉన్నాయి. నాకు సంవత్సరానికి రూ. 100 కోట్లకు మించిన వేతనమున్న యువకుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా. నాది అత్యాశ కాదు.. ప్ర‌స్తుతం యేడాదికి రూ.2 కోట్లు సంపాదిస్తున్న వారు కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి వారే..నేను నా అభిప్రాయాన్ని నిజాయితీగా చెపుతున్నాను. నేను డేటింగ్ చేసిన వారిలో రూ. 50 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్న వారు మాత్రమే ఉన్నారు. అది నాకు స‌రిపోదు. న్యూయార్క్ సిటీ గార్డెన్ పశ్చిమ ప్రాంతంలో ఓ నివాస గృహాన్ని కొనాలంటే, రూ. 50 కోట్ల ఆదాయం సరిపోదు. అందువల్ల నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా? వీటికి సమాధానం తెలిస్తే చెప్పండి.

పూజ ప్ర‌శ్న‌లు:
1 – ధ‌న‌వంతులైన బ్రహ్మచారులు ఎక్కడ దొరుకుతారు ? (బార్లు, రెస్టారెంట్లు, జిమ్ ల చిరునామాలను దయచేసి చెప్పండి)
2- ఏ వయసు వారిని నేను లక్ష్యంగా చేసుకోవాలి ?
3- ధనవంతుల భార్యలంతా యావరేజ్ అందంతోనే ఉంటారెందుకు? నేను చూసిన వారిలో అందం త‌క్కువ‌గా ఉన్న అమ్మాయిలు చాలా మంది ధ‌న‌వంతుల‌ను పెళ్లి చేసుకున్నారు.. ఇందుకు రీజ‌న్ ?
4- ఎవరినైనా చూస్తే, భార్యగా చేసుకోవాలని ఏ కారణాలతో అనిపిస్తుంది ? స్నేహితురాలిగా ఎవరిని ఉంచుకుంటారు? (నా టార్గెట్ మాత్రం పెళ్లి చేసుకోవడమే)

పూజా చౌహాన్ ప్ర‌శ్న‌ల‌కు ముఖేష్ అంబానీ ఆన్స‌ర్‌

ప్రియమైన పూజా,
నీ పోస్టును ఆసక్తిగా చదివాను. నీలాంటి ప్రశ్నలు వేసే అమ్మాయిలు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు..
నా వార్షికాదాయం రూ. 100 కోట్ల పైనే.
ఇది నీ రిక్వైర్ మెంటుకు సరిపోతుంది. కాబట్టి నేను నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు నా సమయం వృథా చేసుకోవడం లేదు.
ఓ వ్యాపారవేత్తగా, నిన్ను వివాహం చేసుకోవడం నాది రాంగ్ డెసిష‌న్ అవుతుంది..దీనికి సులువైన ఆన్స‌ర్ నా వ‌ద్ద ఉంది..
నువ్వు అందాన్ని ఇచ్చి డబ్బు పొందాలని చూస్తున్నావు. అంటే ‘ఏ’ అనే వ్యక్తి తన అందాన్ని ఇస్తే, ‘బీ’ దాన్ని పొందేందుకు డబ్బు చెల్లించాలి.
ఇక్కడో ప్రధానమైన సమస్య ఏంటంటే, నీ అందం రోజురోజుకూ తరిగిపోతుంది.
నా ఆదాయం ఓ సరైన కారణం లేకుండా తగ్గదు. పైగా ప్రతియేటా నా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. నీ అందం సంవత్సరం గడిచే కొద్దీ తగ్గుతుంది.
ఇక ఫైనాన్షియ‌ల్‌గా చూస్తే నాది పెరిగే ఆస్తి, నీది తరిగే ఆస్తి. అది కూడా వేగంగా తగ్గిపోతుంది. గరిష్ఠంగా పదేళ్లు మాత్రమే నీ అందం నీతో ఉంటుంది. ఇదే వాల్ స్ట్రీట్ పరిభాషలో చెప్పాలంటే, ప్రతి ట్రేడింగ్ కూ ఓ పొజిషన్ ఉంటుంది.
డేటింగ్ కూడా ఓ ట్రేడింగ్ పోజిషనే.
ట్రేడ్ విలువ పడిపోతుంటే, దాన్ని దీర్ఘకాలం దగ్గరే ఉంచుకోవడం మంచి ఆలోచన అనిపించుకోదు.
నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే, అది మంచి ఆలోచన ఎంతమాత్రం కాదు. విలువ పడిపోతున్న ఆస్తిని అమ్మేయాలి లేదా వదిలించుకోవాలి.

ఎవరికైనా రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందంటే, అతడేమీ తెలివి తక్కువ వాడేమీ కాదు. అతను నీతో కేవలం డేటింగ్ మాత్రమే చేస్తాడు. నేను నీకిచ్చే సలహా ఏంటంటే, ధనవంతుడిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన వదిలేసి ముందుగా రూ.100 కోట్లు ఎలా సంపాదించాల‌న్న‌ది ఆలోచించు. అప్పుడు నీ కోరిక తీరేందుకు మరింత మంచి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా సమాధానం నీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను.

ముఖేష్ అంబానీ

పూజ ప్ర‌శ్న‌ల‌కు ముఖేష్ అంబానీ ఇచ్చిన స‌మాధానం దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది యువ‌త ఆలోచ‌న‌ల‌కు చ‌క్క‌ని ఆన్స‌ర్ అయ్యింద‌న్న ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా క‌ల‌ల్లో విహ‌రిస్తూ వాటిని సాధించేందుకు గ‌మ్యం లేకుండా ఉన్న సోమ‌రుల‌కు ఇది చ‌క్క‌ని ఆన్స‌ర్‌. ఫైన‌ల్‌గా ముఖేష్ క‌ల‌లు క‌నండి..వాటిని తీర్చుకునేందుకు క‌ష్ట‌ప‌డండి అన్న లోకోక్తి స్టైల్లో స‌మాధానం ఇచ్చాడు.

Leave a Reply