-రాజధానిపై సుప్రీం కోర్టు కోర్పును ఆహ్వానిస్తున్నాం
-న్యాయ స్థానాలు టౌన్ ప్లానర్‌లా వ్యవహరించడం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది
-పవన్‌ది జనసేన కాదు..రౌడీ సేన..అమ్ముడుపోయిన సేన
-మంత్రి అంబటి రాంబాబు
అమరావతి: రాజధానిని నిర్ణయించాల్సింది, నిర్మించాల్సింది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే కానీ న్యాయ స్థానాలు కాదని సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజధానిపై సుప్రీం కోర్పును ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుపై మంత్రి స్పందించారు. వెలగపూడి సచివాలయం వద్ద అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పిల్‌కు వెళ్లడం జరిగింది. వికేంద్రీకరణపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీం కోర్టు ఒక మధ్యంతర ఉత్తర్హులు ఇచ్చింది. మూడు మాసాల్లో, లేదా ఆరు మాసాల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇది వికేంద్రీకరణకు బలాన్ని ఇచ్చే అంశంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దాంతో పాటు సుప్రీం కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఈ వ్యాఖ్యలు కూడా మీడియాలో చూశాం. న్యాయ స్థానాలు టౌన్ ప్లానర్స్ కాదు..వారు టౌన్ ప్లాన ర్స్‌గా వ్యవహరించడం సరైన విధానం కాదని చెప్పింది. ఈ వ్యాఖ్యలు గమనిస్తే..రాజధానుల నిర్ణయంలో న్యాయ స్థానాల జోక్యం సరైంది కాదని నా అభిప్రాయం. రాజధానులు నిర్ణయించవలసింది. నిర్మించాల్సింది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, లేదా దేశ రాజధాని అయితే కేంద్ర ప్రభుత్వమే తప్ప న్యాయ స్థానాలు కాదు.
రాజధానులు ఎక్కడ ఉండాలో చెప్పాల్సింది న్యాయ స్థానాలు కాదని సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టమవుతుంది. దీనితోనైనా చంద్రబాబు లాంటి వ్యక్తులకు కాస్త జ్ఞానోదయం కలిగితే బాగుంటుంది. చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపించారే తప్ప ఎక్కడ నిర్మాణాలు చేపట్టలేదు. ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చూశాం. సూర్య దేవాలయం దాకా పాదయాత్ర పెట్టారు. తాత్కాలిక విరామం అన్నారు. అది తాత్కాలికం కాదు.. శాశ్వత విరామం అని ఆ రోజే నేను చెప్పాను. రాజధానుల విషయంలో ఉద్యమాలు చేయడం సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాలకు న్యాయం చేయాలన్న సదుద్దేశ్యంతో శాస్తీ్రయంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తలపెట్టింది. అదే పద్ధతుల్లో ముందుకు వెళ్లే విధంగా అందరూ మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
పవన్ రాజకీయ అవగాహన లేని వ్యక్తి పవన్ కల్యాణ్, ఇప్పటం గ్రామంలో రోడ్డుపై ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పటంలో గోడలు పగులగొడితే ఉద్యమం అంటున్నారు. ఇప్పటం ప్రజలు చూపించిన తెగువ..దొంగ సంతకం పెట్టి రూ.14 లక్షలు కోర్టుకు కట్టడం తెగువనా? అమరావతి పాదయాత్రలో ఆ ప్రాంత రైతులే లేరు. ఐడెంటిటీ కార్డు చూపించమనగానే పారిపోయారు.
రాజకీయాల్లో పవన్ పెద్ద జోకర్
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పెద్ద జోకర్ అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయి నోట్లో వేలు పెట్టుకుని చూస్తున్నారు కదా?. సినిమాలు ఎప్పుడు సీరియస్‌గా ఉంటే జనాలు చూడరు. రాజకీయాల్లో కూడా సీరియస్‌నెస్ ఉంటే బాగుండదని అప్పుడప్పుడు వచ్చి పవన్ జోకులువేస్తుంటారు. పవన్..సినిమాల్లో హీరో..రాజకీయాల్లో పెద్ద జోకర్. ఆయన మాటలు చూస్తే..పడగొడతా..పడగొడతా అని కేకలు వేస్తున్నారు. పవన్ మాట్లాడే మాటలు టీవీ చానల్స్‌కు పెద్ద కామెడీగా ఉంటుంది. అది జనసేన కాదు..రౌడీ సేనా..ఇదే పదే పదే అంటాను. బానిస సేన..అమ్ముడపోయిన సేన ఇదే వందసార్లు అంటాను. విప్లవ సాహిత్యం చదివిన ప్రతి వాడు విప్లకారుడు అయితే చాలా కొంపలు అంటుకుపోయేవి. మార్క్సిజమ్ గురించి విన్నవాడు, గద్దరు పాటలు విన్నవాడు, వరవరరావు పుస్తకాలు చదివిన వార ందరూ విప్లవకారులైతే ఈ దేశం ఏమై పోయేది?.పవన్ పుస్తకాలు బాగా చదువుతారు కాబట్టి కొన్నాళ్లు చెగువీరా అన్నారు. ఆ చెగువీరా ఏమై పోయారో అర్థం కావడం లేదు.ఇప్పుడు మోదీ అంటున్నారు. చెగువీరా ఎక్కడా? మోదీ ఎక్కడా? నాకు అర్థం కావడం లేదు. మేధావులారా? విప్లవ సాహిత్యం చదివిన ఓ ఆంధ్ర ప్రజలారా ఆలోచన చేయండి. ఎక్కడ మోదీ..ఎక్కడ చెగువీరా?. పవన్ పెద్ద మెంటల్ కేసు కాకపోతే ఏంటిది? కొంత సేపు సీపీఐ, సీపీఎం అన్నాడు. ఆ తరువాత బీఎస్పీ, మళ్లీ టీడీపీ, చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా నోరు ఎత్తారా?. ఇవాళ మా ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారు.