ఏప్రల్ 14 అంబేడ్కర్ జయంతి
‘అంబేడ్కర్‌పై సరైన అవలోకన, అవగాహన ఇంకా రాలేదు’ అన్నది క్షేత్రవాస్తవంగానూ ప్రస్ఫుటంగానూ మనదేశంలో కనిపిస్తోంది! ఇప్పటికైనా ఆయనపై సరైన అవగాహన రావాలి, కావాలి.
అంబేడ్కర్ మన దేశంలోని చాలమంది రాజకీయ నాయకులకన్నా ఉన్నతమైనవారు. చదువుకున్నవారు. చదువుకోవడంవల్ల ఆయనలో దేశానికి పనికివచ్చే దార్శనికత ఉండేది. కానీ ఆయన దార్శనికత ఫలించకపోవడం దేశానికి జరిగిన పెనునష్టం. చాలమంది ప్రముఖ నాయకులకన్నా అంబేడ్కర్
మేలైన వ్యక్తి; మహాత్ములకన్నా గొప్పవారు. ఈ దేశం కోసం పని చేసినవారు. కొన్ని విలువైన పరిశీలనలు, ఈ దేశానికి అవసరమైన సూచనలు చేసినవారు.
పాకిస్తాన్ విభజన విషయంలో అంబేడ్కర్ తన దార్శనికతతో చెప్పింది ఆచరణలోకి వచ్చి ఉన్నట్టయితే కొన్ని లక్షల హిందూ కుటుంబాలు నాశనం అవకుండా ఉండేవి; జనవినాశనం తప్పేది.
కామ్యూనిజమ్, క్రిస్ట్అనిటి, ఇస్లామ్ విషయమై అంబేడ్కర్ దార్శనికత అమోఘమైంది. విదేశీ మతాలవల్లా, విధ్వంసకర ఇజాలవల్లా మన దేశానికి జరిగిన హాని అంతా, ఇంతా కాదు. ఈ దేశంలో జరిగిన, జరుగుతున్న హిందూ నరమేధం, ఇస్లామ్, క్రైస్తవ మతమార్పిడులవల్ల కలిగిన హాని, విదేశీ మతోన్మాద ధనంతో ఈ దేశంలో జరిగిన జరుగుతున్న రక్తపాతం, విధ్వంసం… వీటిని ఒక చదువు ఉన్న వ్యక్తిగా ఈ గడ్డబిడ్డగా, దేశప్రయోజనాల్ని కోరుకునే భారతీయుడిగా అంబేడ్కర్ ముందే ఊహించి ఇవి జరగకుండా ఉండే మార్గాల్నీ తెలియజెప్పారు. కానీ అంబేడ్కర్ పరిశీలనలు, సూచనలకు వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగిపోయాయి. జరుగుతూనే ఉన్నాయి. వాటివల్ల ఈ దేశం బాధపడుతూనే ఉంది. నష్టపోతూనే ఉంది.
అంబేడ్కర్ ఎన్నికల్లో ఓడిపోతే అంబేడ్కర్ విలువను, గొప్పతనాన్ని, అవసరాన్ని గుర్తించి ఈ మట్టి మీద మమకారమున్న హిందూత్వపు శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇతరులతో కలిసి పనిచేసి రాజ్యసభకు పంపారు. భారతీయ చింతన అంబేడ్కర్ కు వెన్ను దన్నుగా నిలిచింది అని ఈ సంఘటన తెలియజేస్తోంది. హిందూత్వం లేదా జాతీయ భావజాలం సాయంతోనే అంబేడ్కర్ నిలబడగలిగారు అనీ, ఇతరులు ఆయన్ను తిరస్కరించారు అనీ కూడా చరిత్ర స్పష్టంగా తెలియజేస్తోంది.
పబ్బం గడుపుకోవడానికి, పెద్ద ఎత్తున లబ్ది పొందడానికి గత కొన్ని దశాబ్దులుగా కొందరు “అంబేడ్కర్, అంబేడ్కర్” అంటూ అరుస్తున్నారు. వీళ్లు అంబేడ్కర్‌ను తెలుసుకున్నట్టూ, అర్థం చేసుకున్నట్టూ లేదు. 70వ దశకం వరకూ మనదేశంలే అంబేడ్కర్ ప్రసక్తి పెద్దగా లేదు. విదేశీ మిషనరీల డబ్బుతో 70వ దశకంలో అంబేడ్కర్ పేరుతో మన దేశంలో రచ్చ మొదలైందనీ, ఇది దేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ మతం కుట్ర అనీ ఇవాళ మతిస్థిమితం ఉన్నవాళ్లు, మామూలు పౌరులు అర్థం చేసుకుంటున్నారు.
అంబేడ్కర్ తన జీవితకాలంలో తగిన ప్రజాదరణ పొందారా? లేదు. ఎందుకు పొందలేదు? అయన ఎన్నికల్లో ఓడిపోవడం దేన్ని సూచిస్తోంది? స్వతంత్రం వచ్చాకే కాదు అంతకు ముందు కూడా ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. రాజకీయంగా ఆయన ఎవరితోనూ ఇమడలేదు. అంబేడ్కర్ ఒంటరి పోరాటమే చేశారు. జీవితకాలంలో ఆయనకు తగిన అంగీకారం రాలేదు. ఆయన మనదేశంలో పెద్ద ఎత్తున నిరాదరణకు గురైయ్యారు, బలైయ్యారు.
దేశంలోనే తొలిసారి కులం పార్టీ పెట్టి దారుణంగా విఫలమయ్యారు అంబేడ్కర్. ఆ కులం ఒట్లే ఆయనకు రాలేదు.
ఇవాళ అంబేడ్కరిస్ట్లం అని చెప్పుకుంటున్న చాలమంది నిజమైన అంబేడ్కరిస్ట్లు కారు అనీ, పబ్బంగడుపుకోవడానికి, పేరు, డబ్బు, ఉనికి సంపాదించుకోవడానికి, సాటి పౌరులపై ద్వేషం వెళ్లగక్కడానికి అలా అంటూ ఉంటారు అనీ, మామూలుగా ఎదగలేని, ఎదగడానికి కావాల్సిన చదువు, ప్రతిభ, బుద్ధి, సంస్కారాలు లేని ఉన్మాదులు అనీ గత కొన్నేళ్లుగా పెద్దశాతం ప్రజలు తెలుసుకుంటున్నారు.
కామ్యూనిజమ్, క్రైస్తవం, ఇస్లామ్ ఈ దేశానికి హానికరమైనవని ఎంతో సాహసంగా, సరిగ్గా ఎప్పుడో చెప్పారు అంబేడ్కర్. ఆయన ఎప్పుడో చెప్పింది ఇవాళ్టికీ క్షేత్రవాస్తవంగా జరుగుతున్న కీడు రూపంలో మనకు తెలియవస్తూనే ఉంది కదా?
“మేం అంబేడ్కరిస్ట్లం” అని రాద్ధాంతం చేస్తున్న శక్తులు ఈ అంబేడ్కర్ మాటల్ని ఎందుకు తీసుకోలేదు? ఈ విషయమై వాళ్లు అంబేడ్కర్‌ను ఎందుకు అనుసరించరు? అంబేడ్కరిస్ట్ లు ఎందుకు అంబేడ్కరిస్ట్ లు గా బతకడం లేదు? ఈ ఒక్క విషయం చాలు “అంబేడ్కరిస్ట్లం” అని చెప్పుకుంటున్నవాళ్లు అంబేడ్కరిస్ట్లు కాదు అని స్పష్టమవడానికి.
జీవించి ఉన్నప్పుడు నిరాదరణకు గురైన, బలైన అంబేడ్కర్ పేరుతో గత కొన్నేళ్లుగా మనదేశంలో రాద్ధాంతం జరుగుతోంది. ఈ రాద్ధాంతంవల్ల దేశానికి, ఈ దేశంలోని సగటు మనిషికి ఏ ప్రయోజనమూ కలగడంలేదు. ఏ కొందరో పెద్ద ఎత్తున లబ్ది పొందుతూ ఉండబట్టే అంబేడ్కర్ పేరుతో ఈ రాద్ధాంతం జరుగుతోందేమో? లేకపోతే కొందరి అజ్ఞానం, ఉన్మాదం కారణాలేమో? సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా అంబేడ్కర్ పేరుతో రచ్చ జరుగుతూ ఉండడం సమాజానికి క్షేమకరం కాదు. అంబేడ్కర్ పై సమగ్రమైన అవలోకన చేసి సరైన అవగాహనకు వస్తే మన సమాజానికి పెనుకీడు తప్పిపోతుంది.
ఎన్నికల్లో ఓడిపోయిన అంబేడ్కర్ రాజ్యసభ సభ్యుడయ్యారు. దానికి కారణం హిందూత్వ భావాల భారతీయ శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా పనిచేశారు. దీన్ని బట్టి సంఘ్ భావజాలాన్ని అంబేడ్కర్ ఒప్పుకున్నారని తీసుకోవచ్చా? లేదా అంబేడ్కర్ కూడా అవకాశవాద రాజకీయాలు చేశారా?
గాంధీ, నెహ్రూ లను వ్యతిరేకించిన వ్యక్తి అంబేడ్కర్. ఆ వాస్తవాన్ని ఇవాళ్టి అంబేడ్కరిస్ట్లు ఎందుకు దాస్తున్నారు? అంబేడ్కర్ భార్య ఒక బ్రాహ్మణ వనిత. ఆయన పేరులోని అంబేడ్కర్ అన్నదే బ్రాహ్మణ్యం పేరు. అంటే అంబేడ్కర్ బ్రాహ్మణ్యాన్ని అందుకున్నారా? అంబేడ్కర్ ను రాజ్యసభకు పంపిన శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా బ్రాహ్మణ వ్యక్తే. ‘బ్రాహ్మణులవల్ల లబ్ది పొందిన అంబేడ్కర్’ అన్నది చారిత్రిక వాస్తవం కాదా?
అస్పృశ్య అని అనబడుతున్న జాతిలో పుట్టిన వ్యక్తికి అంబేడ్కర్ అన్న బ్రాహ్మణవ్యక్తి విద్యాబుద్ధులు నేర్పించి అంబేడ్కర్ గా రూపొందించాడు. బ్రాహ్మణ వ్యక్తులు తప్పితే ఇతరులెవరూ అంబేడ్కర్ కు ఎందుకు చేయూతనివ్వలేదు? అంటే ఇతరుల్లో మనుషులు లేరా? మరెవరికీ అంబేడ్కర్ గొప్పతనం తెలియరాలేదా?
నిమ్న అనబడుతున్న కులంలో ఒకడై పుట్టిన అంబేడ్కర్ ఆ కులం వ్యక్తుల ప్రగతి కోసం ఏమైనా చేశారా? ఒక బ్రాహ్మణవ్యక్తివల్ల ఆంబేడ్కరైన ఆయన మరో అంబేడ్కర్ ను రూపొందించగలిగారా? బ్రాహ్మణ వనితను భార్యగా చేసుకుని ఆ బ్రాహ్మణ కులాన్ని వ్యతిరేకిస్తూ ఆయన బతికారా?
ఇస్లామ్, క్రిస్టిఅనిటి, కమ్యూనిజమ్ వీటిని అంబేడ్కర్ నిరసించారు. అంటే అవి ఈ దేశానికి అపాయకరమైనవనే కదా? ఇవాళ అంబేడ్కరిస్టులు క్రిస్టిఅన్లుగానూ, ముస్లీమ్ లుగానూ, కమ్యూనిస్ట్లుగానూ ఉండడమూ, వాటిని నిరసించకపోవడమూ అంబేడ్కర్కు ద్రోహం చెయ్యడం కాదా? పబ్బం గడుపుకోవాలనుకునే కొందరు అసాంఘీకశక్తులకు ఇవాళ అంబేడ్కర్ ఆలంబన అయిపోయారా? అంబేడ్కర్ పేరు మీద మనదేశంలో ఇవాళ జరుగుతున్నదేమిటి?
అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు. బౌద్ధంలో నవయానం లేదా నవీనయానం తనది అని ఆయన ప్రకటించారు. బౌద్ధం ప్రకారం ఈ నవయానం ఇంకో వందేళ్ల తరువాత కానీ రాదు. అంటే భవిష్యత్తులో రానున్న ఆ నవయానాన్ని గతంలోనే అంబేడ్కర్ తీసుకున్నారు! ఇదెలా సాధ్యం? అంటే అంబేడ్కర్ ఇంకేదో బౌద్ధాన్ని తీసుకున్నారా? ఇక్కడ అంబేడ్కర్ ఒక అసత్యాన్ని అనుసరించినట్టు తెలియడం లేదా? కాకుంటే ఆయనకు సరైన తెలివిడి లేదు అని మనం అనుకోవచ్చా?
ఇదీ కాకపొతే అంబేడ్కర్ తన అస్తిత్వం కోసం తప్పు చేసేశారనుకోవాలా? బౌద్ధ మతం తీసుకున్నా తన బ్రాహ్మణ్యం పేరును మార్చుకోలేదు అంబేడ్కర్. మతం మారితే పేరు మారుతుంది. మతం మారాక కూడా తన పేరును మార్చుకోకుండా అంబేడ్కర్ ఇస్తున్న సందేశం ఏమిటి? అసలు మతం మారడం అన్నదే మతవాదం అవదా?
అంబేడ్కర్ తీసుకున్న బౌద్దంలో ఆయనకు అనుయాయులు ఎందుకు లేరు? బౌద్ధం విషయంలోనే కాదు, ఇస్లామ్, క్రిస్ట్అనిటి, కమ్యూనిజమ్ పరంగానూ అంబేడ్కర్ కు అనుయాయులు లేరు. అంబేడ్కర్‌కు అనుయాయులు ఎందుకు లేరు? అంబేడ్కర్ పేరుతో గత కొన్నేళ్లుగా మనదేశంలో అలజడి రేగుతోంది. అది దేశానికి హాని చేస్తోంది. కులోన్మాదులకు, అసాంఘీకశక్తులకు, ఉన్మాదులకు అతీతంగా మనం అంబేడ్కర్ పై అవలోకన, ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ పై సరైన అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. అది దేశానికి, సగటు మనిషికి మేలు చేస్తుంది.

9444012279