మూడవ రోజు పాదయాత్ర బుధవారం గుంటూరు నగరంలో అపూర్వంగా సాగింది. ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. స్థానిక అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్ నుండి ఉదయం బయలుదేరిన పాదయాత్రలకు గుంటూరు నగరంలో అపూర్వ స్పందన లభించింది.
న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు తిరుమలకు చేపట్టిన యాత్ర కు పట్టణంలో అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. టిడిపి పశ్చిమ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో యాత్ర ప్రారంభం అవగా తూర్పు నియోజకవర్గంలో అక్కడి టీడీపీ ఇన్చార్జి నజీర్ అహ్మద్ పెద్ద ఎత్తున ముస్లిం మహిళల తో పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పై పోరాటం చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన పరిరక్షణ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ ఈ యాత్రలో పాల్గొని తన మద్దతు తెలియజేశారు. రైతుల త్యాగాలు ఊరికే పోవు అని న్యాయస్థానం, దేవస్థానాలు మనకు అండగా ఉంటాయని స్పష్టం చేశారు.
రైతుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఈ పాదయాత్రలో జనసేన నాయకులు బోయిన బోయిన శ్రీనివాస్ యాదవ్ తాడికొండ మాజీ శాసనసభ్యులు, టిడిపి నేత తెనాలి శ్రావణ్ కుమార్, డాక్టర్ శైలజ, శివారెడ్డి, మల్లికార్జున రావు, గద్దె తిరుపతిరావు, కోరికల పూరి శ్రీనివాసరావు, రాయపాటి సాయి కృష్ణ, కనపర్తి శ్రీనివాసరావు, సుఖవాసి శ్రీనివాసరావు, మన్నం మోహన కృష్ణ. మల్లే మల్లి, సిపిఐ,సిపిఎం నేతలు తదితరులు పాల్గొన్నారు.మధ్యాహ్నానికి ఏటుకూరు రోడ్డు కు చేరుకొని భోజన విరామం అనంతరం తిరిగి పాదయాత్రను కొనసాగించారు.