ఈ నెల 9న పెట్రోల్ బంక్ ల ముందు రాష్ట్రవ్యాప్తంగా గంటపాటు నిరసన

ప్రతిపక్షంపై దాడులు చేస్తే ప్రజల సమస్యలు తీరవు
జగన్ డబ్బు వ్యామోహంతో రాష్ట్రం నాశనం
దేశంలో అందరిది ఒకదారైతే..తుగ్లక్ సీఎంది మరొకదారి.
జగన్ కంటే ఎక్కువ పన్నులేసే రాష్ట్రం దేశంలో వుందా.?
చేతకాని పాలనతో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ
– టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
పెట్రోల్, డీజిల్ పై జగన్ ఆనాడు ఏం చెప్పారో..ఈ రోజు ఏంచేస్తున్నారో ఆయన చేష్టలు చూస్తే అర్థం అవుతోంది. జగన్ ఆనాడు చెప్పిన మాటలకు నేడు చేసే పనులకు ఏమాత్రం ఒద్దిక లేదు. క్రూడ్ ఆయిల్ రూ.39.4 పైసలకు లభిస్తోంది. రవాణా, చమురు శుద్ధి, ఇతర ఖర్చులు కలిపి పెట్రోల్ రూ.8.80, డీజిల్ రూ.10.20లు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ పన్ను, రోడ్ సెస్ అన్ని కలిపి రూ.27.9పైసలు పెట్రోల్ పై, రూ.21.8 పైసలు డీజిల్ పై వుంది. డీలర్స్ కు పెట్రోల్ పై రూ.3.80పైసలు, డీజిల్ పై రూ.2.60 పైసలు కమిషన్ వుంది. ఈ ఏడాది నవంబర్ 4 నాటికి పెట్రోల్ ధర రూ.79.98పైసలు, డీజిల్ ధర రూ.74.02పైసలు వుంది. అదే విజయవాడలో రూ.110.98లు పెట్రోల్, రూ.97 లు డీజిల్ వుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.5 లు, డీజిల్ పై రూ.10లు తగ్గించాక కూడా ఏపీలో పై విధంగా ధరలు ఉన్నారు. చండీఘర్ లో ఏపీ కంటే రూ.16.75లు పెట్రోల్, డీజిల్ రూ.16.10లు తక్కువగా వుంది. లక్నోలో పెట్రోల్ రూ.15.7లు, డీజిల్ రూ.10.20లు తక్కువగా వుంది. నోయిడాలో పెట్రోల్ రూ.15.47లు, డీజిల్ రూ.9.99లు ఏపీకంటే తక్కువగా వుంది. పాండిచ్చేరిలోని యానాంలో పెట్రోల్ రూ.15.59లు, డీజిల్ రూ.13.35లు ఏపీ ధరల కంటే తక్కువగా ఉన్నాయి. సిమ్లాలో రూ.రూ.15.04 పెట్రోల్, రూ.16.40లు తక్కువగా ఉన్నాయి. గాంటాక్ లో పెట్రోల్ రూ.13.25, డీజిల్ రూ.14.75, ఇంపాల్ లో పెట్రోల్ రూ.11.21, డీజిల్ రూ.12.79, బెంగళూరులో పెట్రోల్ రూ.10.42లు, డీజిల్ రూ.12లు, చెన్నైలో పెట్రోల్ రూ.9.6, డీజిల్ రూ.5.56 తక్కువగా లభిస్తున్నాయి. ఈ ధరలపై ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి.?
అధికారంలోకి వస్తే రేట్లు తగ్గిస్తానన్నాడు
రేట్లు ఎక్కువగా ఉన్నాయి..నేను అధికారంలోకి రాగానే తగ్గిస్తానని పాదయాత్రలో ప్రజలకు చెప్పావు కదా జగన్. చెప్పిన మాటల నుండి తప్పించుకోవడానికి సిగ్గుండాలి. పెట్రోల్, డీజిల్ ధరలను అన్ని రాష్ట్రాలు తగ్గించాయి. అనంతరం కర్నాటక పెట్రోల్ పై రూ.7లు, డీజిల్ పై రూ.7 తగ్గించింది. తమిళనాడు పెట్రోల్, డీజిల్ పై రూ.3లు తగ్గించింది. అస్సాం, గోవా త్రిపురు, గుజరాత్, మణిపూర్ మిజోరం, సిక్కిం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ రూ.7 తగ్గించాయి. హర్యానా పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.12 తగ్గించింది. మధ్యప్రదేశ్ పెట్రోల్, డీజిల్ పై 4 శాతం వ్యాట్ తగ్గించింది. హిమాచల్ ప్రదేశ్ పెట్రోల్ రూ.12, డీజిల్ రూ.17లు, అరుణాచల్ ప్రదేశ్ పెట్రోల్, డీజిల్ పై 5.5శాతం వ్యాట్ తగ్గించింది. ఢిల్లీ పెట్రోల్ పై రూ.6.07లు, డీజిల్ పై రూ.11.75 పైసలు తగ్గించారు. రాజస్థాన్ వ్యాట్ తగ్గించింది. కోవిడ్ వల్ల ఇబ్బందులు పడ్డవారి కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాయి. మీరెందుకు చేయరు జగన్మోహన్ రెడ్డి. అధికారం వుందని బాదుగే పెట్టుకుంటే చెప్పిన దానికి పొంతన ఎక్కడుంది.? ఇదేనా మీ పాలన. ఇది చెత్త పాలన. పెట్రోల్, డీజిల్ పెరిగితే పరిశ్రమలకు ఇబ్బందులు వస్తాయి. వస్తువులు తయారు చేయడానికి అయ్యే ఖర్చు అధికం అవుతుంది. దీనివల్ల ప్రజలపై భారం పడే ప్రమాదం వుంది. వ్యవసాయ రంగంలో అందరూ ట్రాక్టర్లు, ఆర్వెస్టర్ల వాడుతున్నారు. ఇటీవల కుప్పంలో పర్యటించినప్పుడు ఓ రైతు అడిగాను. ఒక ఆర్వెస్టరీకి ఒకటున్నర ఎకరాకు గంటకు రూ.900 అవుతుంది. ఒకటున్నర ఎకరాకు మూడు గంటల సమయం పడుతుంది. ఒక ఆర్వెస్టరీకి రూ.3,600 ఖర్చు అవుతుంది. ఏమీ మిగులుతుందని రైతులను అడిగితే అప్పులు తప్ప ఏమీ మిగిలే పరిస్థితి లేదని రైతులు చెప్పారు. ఈ రోజు జగన్ చేసే పనికి రైతులను కూడా దోచుకుంటున్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. రాష్ట్రంలో వివిధ పనుల అవసరాలపై లక్షలాది మంది ప్రయాణాలు చేస్తారు..అందిరి మీద పెనుభారం పడుతోంది.
రాష్ట్రంలోని రోడ్లపై వెళ్తే ఒళ్లు ఊనమే
రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. వెళ్తే తిరిగివస్తామో లేదో చెప్పలేం. ఒళ్లు ఊనం అవుతోంది. వాహనాలు పాడై రిపేర్లు వచ్చే పరిస్థితి వుంది. గంటలో చేయాల్సిన ప్రయాణం అయిదు, ఆరు గంటలు పడుతుంది. ఇంత అధ్వాన స్థితిని తెచ్చిన జగన్ ను ఏమనాలి. ఒక వైపు విద్వంసం, మరోవైపు ధరల బాదుడు. జగన్ కు అధికారం ఇచ్చింది ప్రజలకు ఉపయోగపడాలని కానీ, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా చేయడానికి కాదు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయి. అడిగిన వాళ్లపై ఈ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. వ్యవస్థలపై దాడులు చేస్తున్నారు..అసెంబ్లీ సమాయాన్ని నిరుపయోగం చేస్తున్నారు. ఐఎఎస్ అధికార వ్యవస్థను నిర్వీర్యం చేసి తప్పుడు పనులు చేయిస్తున్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మీడియాపై తప్పులు కేసులు పెట్టి వేధించి, ప్రభుత్వ తప్పులను రాయాలంటే భయపెట్టే విధంగా చేస్తున్నారు. న్యాయ వ్యవస్థను బెదిరించే పరిస్థితికి వచ్చారు. ఈ వ్యవస్థలన్నీ సామాన్య వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఉన్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చాలా సమస్యలొస్తాయి.
దీనికి ఏం సమాధానం చెప్తావు డీజీపీ..?
రాష్ట్రంలో గంజాయి పట్టుబట్టట్టు ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి. విశాఖ నుండి చెన్నై తీసుకెళ్తున్న 50కిలోల గంజాయి కాజ టోల్ గేట్ వద్ద పట్టుబడింది. దీనికి డీజీపీ ఏం సమాధానం చెప్తారు.? మా కార్యాలయంపై మీ మనుషులు, పోలీసులను పంపించి దాడి చేయించి, మా వాళ్లను ఎందుకు వేధించావు.? విశాఖ ఏజెన్సీలో మిషన్లు తీసుకెళ్లి గంజాయి మొక్కల్ని కోసేస్తున్నారు. ఏజెన్సీ మొత్తం గంజాయి వుంది. ఈ గంజాయి మొత్తం బయటకు వస్తే రాష్ట్రం ఏమైపోతుంది.? నీకు బాధ్యత లేదా డీజీపీ.? బాధనిపించలేదా..సిగ్గనిపించలేదా.? మేము చెప్పే వరకు ఎందుకు నిద్రపాయారు.?ఈ తుగ్లక్ ఎక్కడున్నారు..ఎందుకు నోరు విప్పడం లేదు.? నీకు అది సమస్య కాదా.? అందరినీ బాధ పెట్టి పైసాచిక ఆనందం పొందున్నారు.
దృఢ సంకల్పంతో అమరావతి రైతుల పోరాటం
ఏడు వందల రోజులుగా అమరావతి రైతులు దీక్షలు, నిరసనలు చేస్తున్నారు. ఆడబిడ్డలను పోలీసులు ఇష్టానుసారంగా చెప్పడానికి మాటలు రాని విధంగా వేధించారు. అయినా రైతులు, మహిళలు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లారు. దేవుడానా కరుణించి న్యాయం చేయాలని మొక్కుకోవడానికి న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్రను రైతులు చేపట్టారు. రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. ఐదు ఏళ్లు మీకు అధికారం ఇచ్చింది సక్రమ పరిపాలన చేయడికి, విధ్వంసం చేయడానికి కాదు.
రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ
రాష్ట్రం మళ్లీ తిరిగి కోలుకోలేని దెబ్బ తీశారు. విద్యుత్ చార్జీలు పెంచుకుంటూ పోతున్నాడు. ఇష్ట ప్రకారం విద్యుత్ కొనుగోలు చేస్తున్నాడు. ఇవన్నీ సామాన్యుడే చెల్లించాలి. నీ అవినీతి, డబ్బు వ్యామోహంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తారా.? ధరలు తగ్గించే వరకు పోరాడతాం. 9వ తేదీన అన్ని పెట్రోల్ బంక్ ల ముందు మా పార్టీ శ్రేణులు ధర్నాలు, నిరసనలు చేస్తారు. మధ్యాహ్నం 12 నుండి ఒంటి గంట వరకు ధర్నాలు చేస్తాం. ప్రజల్ని చైతన్యం చేస్తారు. దేశంలో అందరిది ఒకదారైతే..ఏపీ ముఖ్యమంత్రిది మరొకదారి. జగన్ కంటే ఎక్కువ పన్నులేసే రాష్ట్రం వుందా.? మీడియా సమావేశాలు పెట్టి మాపై దాడులు చేస్తే సమస్యలు తీరవు. ప్రతిపక్షం, ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. సరిచేసుకుని పాలించగలిగితేనే ఉండగలుగుతారు..లేకుంటే చరిత్రహీనులవుతారు. అన్ని రాష్ట్రాలకంటే ధరలు ఎక్కవ తగ్గిస్తామని చెప్పారు.. అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అమలు చేసే వరకు పోరాడతాం. కనీసం రూ.17 లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. ప్రజల ముందు పెట్టి జగనే తేడాలు చూడాలి. నిత్యవసర, ఇసుక, కరెంటు, ఆర్టీసీ, చెత్త పన్నలు వంటి ఏరాష్ట్రంలో లేని విధంగా ఉన్నాయి. మరుగుదొడ్డిపైనా పన్నులు వేస్తున్నారు. చరిత్రలో ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రావు. అధికారం, డబ్బుంది..ఎన్నికలొస్తే ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు. అన్ని పార్టీలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు..ప్రజలు తిరిగబడితే మీరు పారిపోతారు. చిన్నపంచాయతీ ఎన్నికలకు కూడా వీళ్లతో పోరాడాల్సి వస్తోంది. ఎన్నిసార్లు చెప్పనా సిగ్గులేకుండా ద్రవిడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మీ లెక్కలన్నీ వుంటాయి. తప్పుడు పనులు చేసిన వారు తప్పించుకోలేరు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం. ఎన్నో సంక్షోబాలను ఎదుర్కొన్నాం. చట్టపరంగా అందరినీ వెంటాడతాం.

Leave a Reply