బతకడం వేరు, జీవించడం వేరు

చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు!

”ఈ వానలో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి,” అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు సుధా మూర్తి గారు ఆగారు.
ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు.
”ఆమె మన అతిథి. ఆమె టీ, కాఫీ తాగరట. పాలు ఇవ్వు!” అని ఆ కూలీ అంటే…
”మన పాపకు ఆ ఒక్క గ్లాసు పాలే వున్నాయి. వాన పడుతోంది. ఆ పాలు ఆమెకిస్తే రాత్రంతా పాప ఏడుస్తుంటుంది!” అంది ఆమె.
”అయినా పరవాలేదు, సగం పాలకు సగం నీళ్ళు కలిపి, చక్కెరతో ఇవ్వు!”అన్నాడు ఆయన.
ఒరియా తెలిసిన సుధామూర్తికి అది వినపడింది… “ఈ రోజు బుధవారం , నేను ఉపవాసం. ఏమీ తీసుకోను.” అంది ఆమె.
”అందరూ సోమ,గురు,శుక్ర,శని వారాలు ఉపవాసం చేస్తారు. మీరు బుధవారం వుంటున్నారే ?” అని అతనంటే…
”అవును, నేను గౌతం బుద్ధుడి కోసం వుంటాను.” అన్నారు ఆమె.
ఆ రాత్రే ఆమె నిర్ణయం తీసుకొన్నారు… ‘గుక్కెడు పాలు తాగలేని పసిపిల్లలు లక్షలమంది నా దేశంలో వుండగా, నేను పాలు తాగడమా? వద్దు!’ అని ఆనాటి నుండి ఆమె పాలు తాగడం మానేసారు.<a href=”https://imgbb.com/”><img src=”” alt=”Sudha-Murthy” border=”0″></a>

TATA వారి TELCO లో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఇంజినీర్ గా ఆమె ప్రవేశించినా…2,21,501 మంది employees తో ఏటా 2.48 బిలియన్ US Dollars ఆదాయం కలిగిన Infosys నడిపే Infosys
infyFoundation కు Chair Person అయినా, సుధా మూర్తి simplicity కి మారుపేరులా ఉంటారు.
అమె దగ్గర వున్నది కేవలం 8 చీరలు మాత్రమే. అంటే మనలో చాలా మంది ఆశ్చర్యపోతారు.
చివరగా ఆమె చీర కొన్నది 1998 లోనే.

ఒక మారు ప్రపంచ ప్రసిద్ధ London Heathrow Airport లో అక్కడి ఇంగ్లీష్ ఆమె, సాధారణ దుస్తుల్లో వున్న సుధా మూర్తి ని చూసి “ఇది ధనవంతులు ప్రయాణించే Business class నీలాంటి వారు అదిగో అక్కడ మామూలు ప్రజలు వెళ్ళే Economy class వుంది వెళ్ళు” అంటే, చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది సుధా మూర్తి.కానీ అదే రోజు 24 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఒక UNO సదస్సులో President హోదాలో, అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అవాక్కయింది ఆ ఇంగ్లీష్ వనిత.

”నిజంగా గొప్పవారికి తాము గొప్పవారనే విషయమే గుర్తుండదు , అదే వారి గొప్పతనం,” అంటాడు చైనాకు చెందిన ‘లా తజు ‘అనే ఒక ఫిలాసఫర్.
కేవలం 8 చీరలే కలిగిన సుధామూర్తి తన ఇంట్లో మాత్రం 20,000 పుస్తకాలు కలిగివున్నారు. తన
1534-1024 ఆదాయాన్ని పేదల చదువుకు , అనాథలకు , ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు ఆమె.
ఖర్చు పెట్టడం వేరు, సరిగ్గా ఖర్చు పెట్టడం వేరు.బతకడం వేరు, జీవించడం వేరు.

– ఏ.వీ.రాజు

Leave a Reply