-అదాన్ డిస్టలరీ డైరక్టర్ విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీల్లోనూ డైరక్టర్ గా ఉన్నారు
-అదాన్ డిస్టలరీ లో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డిల వాటా ఎంతో చెప్పాలి ?
-ఒకే అడ్రస్ తో విజయసాయిరెడ్డి అల్లుడు 19 కంపెనీలు పెట్టారు
-ఇవన్నీ జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సూట్ కంపెనీలే
– ఆనం వెంకటరమణారెడ్డి, వరుణ్ కుమార్
మద్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సాగిస్తున్న దందా బయటపడిందని, అదాన్ డిస్టలరీ పేరుతో కొన్ని డిస్టలరీలు సబ్ లీజుకు తీసుకుని విజయసాయిరెడ్డి అక్రమ సంపాదన కోసం వాటిలో విషపు మద్యం తయారు చేసి ప్రజలు ప్రాణాలు తీస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ ఆరోపించారు.మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ….
అదాన్ డిస్టలరీ విజయసాయిరెడ్డి బ్రోకరేజ్ కంపెనీ. అదాన్ డిస్టలరీకి డైరక్టర్ ఉన్న శ్రీనివాసా కాశిచాయానుల అనే వ్యక్తి విజయసాయిరెడ్డి అల్లుడు పెన్నాక రోహిత్ రెడ్డి చెందిన పలు కంపెనీల్లో డైరక్టర్ గా ఉన్నాడు. అదాన్ డిస్టిలరీకి, విజయసాయిరెడ్డికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని ఆధారాలతో సహా బయటపెడుతున్నాం. విజయసాయిరెడ్డి అల్లుడు పెన్నిక రోహిత్ రెడ్డి ఒకే అడ్రస్ తో 19 కంపెనీలు పెట్టారు. హైదరాబాద్ లో 1-121/1 66 పార్ట్ అండ్ 67 పార్ట్ మియాపూర్, శేరిలింగంపల్లి, తెలంగాణలో 19కంపెనీలు ఒకే అడ్రస్ లో ఉన్నాయి. వీటిలో…యాక్సెస్ క్లినికల్స్, అరబిందో లేక్ వ్యూ డెవలపర్స్, రెక్సాన్ టెక్నాలజీస్, అరబిందో తత్వ టౌన్ షిప్ డెవలపర్స్, శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్, టెనెట్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా చెబుతూ పోతే మరో 30 కంపెనీలు నుండి 50 వరకు ఒకే అడ్రస్ మీద ఉన్నాయి. వీటిలో అత్యధిక కంపెనీల్లో విజయసాయిరెడ్డి పిన్నాక రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మరికొన్ని కంపెనీల్లో అదాన్ డిస్టలరీ డైరక్టర్ గా ఉన్న శ్రీనివాసా కాశిచాయానుల అరబిందో, శ్రేయాస్, టెనెట్ కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నాడు. రోహిత్ రెడ్డి, శ్రీనివాస్ కాశికిచాయానులకు ఉన్న సంబందం ఏంటో విజయసాయిరెడ్డి చెప్పాలి. ఇవన్నీ జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సూట్ కేసు కంపెనీలే.
చంద్రబాబు హయాంలోనే డిస్టలరీలకు పర్మిషన్లు ఇచ్చారని వైసీపీ ప్రభుత్వం డిస్టలరీలకు పర్మిషన్స్ ఇవ్వలేదని విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదాన్ డిస్టలరీ 2019 డిసెంబర్ 2న స్ధాపించింది వాస్తవం కాదా? అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడా? జగన్ రెడ్డా విజయసాయిరెడ్డి చెప్పాలి. అదాన్ డిస్టలరీ రెండున్నరేళ్లలో రూ.2,400కోట్ల మద్యం అమ్మేశారు. అదృష్టం కలిసొస్తే, నడిచొచ్చే కొడుకు వస్తాడన్నట్టు జగన్ రెడ్డికి అదాన్ కంపెనీ అలాంటిదే. అదాన్ డిస్టలరీలో జగన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి, అతని అల్లుడికి ఎంతెంత వాటాలున్నాయో చెప్పాలి. వైసీపీ ప్లీనరీలో మమ్మల్ని 420లు అన్నారు. 420లు ఎవరు సూట్ కేసు కంపెనీలు పెట్టిన మీరు కాదా? అదాన్ డిస్టిలరీస్ కు అసలు ఒక్కటైనా సొంత డిస్టిలరీ ప్లాంట్ ఉందా? వేరే డిస్టిలరీలను లీజుకు తీసుకుని విషపు మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసి కోట్లు కూడబెడుతున్నారు. డబ్బులు కావాలంటే న్యాయంగా సంపాదించుకోవాలి గానీ డబ్బుల కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టడ్డం దుర్మార్గం. ఈ డబ్బంతా ఏం చేసుకుంటారు? చనిపోయాక తీసుకెళ్తారా? మీకు డబ్బులు కావాలంటే చెప్పండి…మేమంతా తట్ట ఎత్తుకుని అడుకొచ్చి వందకోట్లు, వెయ్యి కోట్లు పోగేసి ఇస్తాం. అంతే తప్ప విషపు మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీయెద్దు. మేం అధికారంలోకి వచ్చాక వైసీపీ అక్రమ వ్యాపారాలన్నీ బయటకు తీసి కోర్టుకెక్కిస్తాం. తప్పు చేసినవాడెంతోడైనా తాట తీస్తాం. ఏ ఒక్కడినీ వదలం. మీ కల్తీ మద్యం తాగి చనిపోయిన ప్రతి ఆత్మకు మీ కుటుంబాలన్నీ సమాధానం చెప్పాలి. లేకుంటే ప్రతి ఆత్మ మిమ్మల్ని పీడిస్తుంది, వెంటాడిస్తుంది, ఇది మీకు కలిసొచ్చే అంశం కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఆదాన్ డిస్టిలరీలు మీవేనని తేలిపోయింది. అదాన్ డిస్టలరీలతో నాకు సంబదం లేదని విజయసాయిరెడ్డి నిరూపించగలరా? దమ్ము, ధైర్యం అని వాగే రోజా తనకు దమ్ము ధైర్యం ఉంటే ఆదాన్ డిస్టిలరీ సీఎం, విజయసాయిరెడ్డికి సంబంధం లేదని రుజువుచేయాలి. మీరు తయారుచేసే మందుకు రూ.10 నుండి రూ.12 కూడా ఖర్చు కాదు….కానీ దీన్ని రూ.160కి అమ్ముతున్నారు. మీకు అసలు మనస్సాక్షి ఉందా? ఈ దుర్మార్గపు డిస్టిలరీలన్నీ మూసివేయించి, పాత మద్యం విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడాలి. మహిళలు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవడానికి మాంగల్యాలను తాకట్టు పెట్టుకుంటున్నారు. అదాన్ డిస్టిలరీలకు సంబంధించిన పూర్తి వివరాలు టీడీపీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తాం…ప్రజలంతా చూసుకోవచ్చు. ఆదాన్ డిస్టిలరీస్ మీద చర్చకు నేను ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్దం విజయసాయిరెడ్డి సిద్దమా? మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్లకు తాకట్టు పెట్టి రూ. 33 వేల కోట్లు అప్పు తీసుకొచ్చిన జగన్ రెడ్డి పేరును గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కించవచ్చు. రాష్ట్రంలోని డిస్టిలరీలు అన్నీ జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నియంత్రణలోనే ఉన్నాయని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.
తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న మద్యంలో విష రసాయనాలున్నాయని ల్యాబ్ నివేదికలో తేలింది. ఈ విషయాన్ని ప్రజలకు చెబితే.. వాటిపై మమ్మల్ని బెదిరిస్తున్నారు తప్ప వాటిలో విష రసాయనాలు లేవని నిరూపించలేకపోయారు. మద్య పాన నిషేదం చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కనీసం ప్లీనరిలో వైసీపీ నేతలు మద్యపాన నిషేదంపై ఎందుకు తీర్మానం చేయలేదు? మేం మద్యంలో విష రసాయనాలున్నయని చెబుతుంటే వైసీపీ నేతలు దానికి సమాధానం చెప్పకుండా డిస్టలరీలకు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్రం విడిపోయాక ఎక్కువ డిస్టలరీలు తెలంగాణలో ఉన్నందున నాడు నాన్ రీపండ్ బుల్ మెకానిజంతో కొన్ని డిస్టలరీలకు చంద్రబాబు నాయుడు అనుమతిచ్చారు. వాటిలో అన్ని ఇంటర్నేషనల్ , నేషనల్ బ్రాండ్స్ క్వాలిటీ మద్యం అమ్మారు. కానీ జగన్ రెడ్డి మనుషులు ఆ డిస్టలరీలను కబ్జా చేసి కమీషన్ల కోసం విషపు మద్యం తయారు చేస్తున్నారు. మద్యపాన నిసేదం చేస్తామన్న జగన్ రెడ్డి 6 డిస్టలరీలకు ఎందుకు అనుమతిచ్చారు? ఓ వైపు మద్యపాన విమోచన నిషేద కమిటీ కి అని లక్ష్మణరెడ్డిని చైర్మన్ గా నియమించి నెలకు లక్షల రూపాయలు ప్రజా సొమ్ము దోచిపెడుతున్నారు. మరో వైపు మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా పెట్టి రుణాలు తేవటం దుర్మార్గం. సిల్వర్ స్ట్రైప్, ఆంధ్రా గోల్డ్, నైన్ సీ హార్స్ విస్కీ ల్లో విష రసాయనాలున్నాయి. ఎక్కువగా రాష్ట్రంలో ఈ బ్రాండ్లే అమ్ముతున్నారు. అక్రమ సంపాదన కోసం ప్రజలు ప్రాణాలు తీయడం మానుకోవాలి. ఇకనైనా మీరు చెప్పినట్టు మద్యపాన నిషేదం చేస్తారా? లేక క్వాలిటీ మద్యం విక్రయిస్తారో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని వరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.