Suryaa.co.in

National

ప్రధాని మోదీ మృతి అంటూ నోరు జారిన యాంకర్

ఢిల్లీ: ప్రముఖ న్యూస్ ఛానల్ ‘ఆజ్ తక్’ యాంకర్ నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణవార్తను ప్రస్తావిస్తూ నోరు జారారు. ‘ఎయిమ్స్ వైద్యులు ఇప్పుడే ప్రకటన విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో ప్రధాని నరేంద్ర మోదీ మరణించారని వెల్లడించారు’ అని ఆమె అన్నారు. అంతలోనే తప్పు తెలుసుకొని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారని తన కామెంట్ను సరిదిద్దుకున్నారు. గతంలో రూ.2వేల నోట్లలో చిప్ ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE