– గోకవరం మండలం టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం
– ముఖ్యఅతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
గోకవరం: తూర్పుగోదావరి జిల్లా గోకవరం డిసెంబర్ 27: గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు సమావేశం సూది కొండ లో గోకవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంగ రౌతు రామకృష్ణ అధ్యక్షత జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల సమస్యలు నాయకులు నవీన్ కి తెలియజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, మండలంలో అధిక సంఖ్యలో టిడిపి సభ్యత్వ నమోదు చేయించాలని, గ్రామ సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకుని మాకు తెలియజేసే ఆ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని, గ్రూపు రాజకీయాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలని, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమర్థులైన నాయకులను అభ్యర్థులుగా నిలబెట్టుకుందామని ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను ఆదుకోవాలని, కాపాడుకోవాలని నేను పని చేస్తాను అని అన్నారు