తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్
అమరావతి : జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కమిషన్ ల కోసం, అవినీతి సొమ్ము కోసం చేయవలసిన తప్పుడు పనులు చేసి వైసీపీ పార్టీ నాయకులతో విద్యుత్ చార్జీలు పెంచారని నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేపిస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి హయాంలో సెబి ద్వారా గుజరాత్ లో 1.99 పైసలు యూనిట్ ఉంటే ఆంద్రప్రదేశ్ లో మాత్రం అధిక రేటుకి 2.59 పైసలకు, ట్రాన్స్ మిషన్ చార్జీతో కలిపి 4.50 పైసలు ఒక్కో యూనిట్ ప్రజల నెత్తిన రుద్ధాడన్నారు.జగన్ రెడ్డి కమిషన్లకు కక్కుర్తి పడి, 1750 కోట్ల లంచం తీసుకున్నట్లు ఎఫ్ బి ఐ అమెరికా సంస్థ కేసు పెట్టి, అధికారికంగా ప్రకటించిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు.