Suryaa.co.in

Entertainment

అలనాటి అందాలరాముడు

అక్కినేని ముళ్ళపూడి బాపు త్రయంలో 1973లో వచ్చిన అందాలరాముడు పేరుకు తగ్గట్టే అందమైన సినిమానే కాదు మంచి అనుభూతులను మిగిల్చే సినిమా అని చెప్పొచ్చు. ఇంచుమించు సినిమా అంతా గోదావరి నదిపై లాంచీ లో భద్రాచలం ప్రయాణం. ముళ్ళపూడి తన మునుపటి కథల్లో సృష్టించిన పాత్రల తరహాలోనే ఈ సినిమా కథలో పాత్రలు సృష్టించారు. సంగీత పట్ల దర్శక నిర్మాతలకు ఉన్న అభిరుచికి అనుగుణంగా ఈ సినిమాలో పాటలు పద్యాలు కీర్తనలు మొత్తం 13 ఉన్నాయి.

అక్కినేని పాత్ర తన శైలికి భిన్నంగా సాగుతుంది. అందాలరాముడు లో పాటలు బాగున్నా ఘంటసాల లేని లోటు ఒక మైనస్ గా మారింది. పైగా తన రెగ్యులర్ చిత్రాల్లో ఉండాల్సిన డాన్స్ లు, డ్యూయెట్స్ రొమాంటిక్ సీన్స్ లేవు. ఇవి ఈ సినిమా విజయానికి అవరోధాలుగా మారాయి.. ఆస్వాదించాల్సిన అంశాలు ఉన్నా కూడా. అందాలరాముడు ఒక మంచి అనుభూతినిచ్చే సినిమా అని అందరూ తెలుసుకునేసరికి కొన్ని వారాలు పట్టింది.

కొంతమంది అందాలరాముడు చూడటానికి వెళ్ళినవారు తిరిగొచ్చేశారు సినిమా మారిపోవడంతో. ఈ సినిమా వెండితెర నవల కాపీలు బాగా అమ్ముడుపోయాయి. అనేక ఫోన్ కాల్స్ ద్వారా.. ఈ సినిమా చూడాలని చాలామంది అనుకుంటున్నారని గ్రహించి, సుమారు మూడు సంవత్సరాలు తర్వాత ముఖ్య కేంద్రాలలో రీ రిలీజ్ చేయడంతో హౌస్ ఫుల్ వసూళ్లతో నడిచింది. పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చేసింది. పాటలన్నీ సాహిత్యపరంగా బాగుంటాయి. ఆరంభం సన్నివేశం పాట, టైటిల్స్ దగ్గర్నుంచి సినిమా చివర శుభం కార్డు వరకు మొత్తం సినిమా ఓ విందు భోజనంలా ఉంటుంది.

ఆ యా పాత్రలతో మనం మమేకం అవుతాం. హీరోయిన్ లత, నటుడు నూతన్ ప్రసాద్ పరిచయం అయిన సినిమా ఇది. రెండు నందీ అవార్డులు ఈ చిత్రం సొంతం చేసుకుంది. అందాలరాముడు చక్కని హాస్యంతో కూడిన వినోదాత్మక లాంచీ జర్నీ టు భద్రాచలం.. మిస్ అయినవారు మిస్ కావొద్దు.

– గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
విజయనగరం
ఫోన్ 99855 61852….

LEAVE A RESPONSE