– చిత్రం చెప్పే సంగతులు..
రాష్ట్రాన్ని ధాన్యాగారం చేయాలని చూసిన చేతుల్ని తెగనరికి , పోలవరం దారి తెన్ను లేకుండా చేశారు. మనం ఉన్నా లేకపోయినా , ప్రజల భవిష్యత్తు ముఖ్యం అనుకున్న నమ్మకాన్ని చంపేశారు. ఆంధ్రుల జీవనాడి గా, దేశం లో నే ఏపీ నీ అగ్రభాగాన ఉంచాలన్న ధీమా నీ గొంతు నులిమి చంపేశారు. నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు కాల్వ గట్ల మీద తిరిగిన శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేశారు. కృష్ణార్జునులు లాగా ప్రజా క్షేమం కాంక్షిస్తే , వాళ్ళను ఓడించి జనం ఓడిపోయారు.తరతరాల దగాపడ్డ ఆంధ్రులను అందలం ఎక్కించాలని చూస్తే , అదహ పాతాళానికి తొక్కేసారు.
సోమవారం పేరు మార్చి పోలవరం అయ్యే పనితనాన్ని , హేళన చేసి వంచన చేశారు. చంటి బిడ్డలా జలాన్ని కాపాడిన వారిని , బంధాలు వేసి మరీ అడ్డుకున్నారు . ఆఖరిగా ఒక మాట.. ఆంధ్రుడా నీ వినాశనాన్ని నువ్వే తెచ్చుకున్నావు. ఈ దృశ్యం చూసాక నాలో కలిగిన వేదన అక్షర రూపం లో.
– ఈమని సూర్య నారాయణ
(టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు మరియు అధికార ప్రతినిధి)