– జగన్ సన్నిహితుడు, అనిల్ కుమార్ యాదవ్ కి మిత్రుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డికి రిమాండ్
విజయవాడ: అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కోర్ట్ ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది. రుస్తుం మైన్స్ లో జరిగిన అక్రమ మైనింగ్ కి సంబంధించి శ్రీకాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో A12 గా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పేరుని చేర్చారు. రిమాండ్ విధించడంతో శ్రీకాంత్ రెడ్డిని జిల్లా జైలుకి తరలించారు. ఇదే మైన్ లో అనిల్ యాదవ్ కూడా వాటాదారుడని, ఈ కేసులో త్వరలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.