– కొవిడ్ సెంటర్లకు ఆహార బిల్లుల చెల్లింపులు
– చెల్లింపులో ఆలస్యంపై హైకోర్టుకు క్షమాపణ
రాష్ట్రంలో కొవిడ్ సెంటర్లకు ఆహారం సరఫరా చేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యంపై.. ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. పిటిషనర్లకు ఇప్పటికే బిల్లులు చెల్లించామని హైకోర్టుకు హాజరైన ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు.
రాష్ట్రంలో కొవిడ్ సెంటర్లకు ఆహారం సరఫరా చేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యంపై.. ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. ఆహారం సరఫరా బిల్లులు చెల్లించకపోవడంతో.. గుత్తేదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరపగా.. ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి కాటమనేని భాస్కర్ హాజరై వివరణ ఇచ్చారు.
పిటిషనర్లకు ఇప్పటికే బిల్లులు చెల్లించామని తెలిపారు. ఆలస్యం కావడంపై హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. కొవిడ్ కేర్ సెంటర్లకు ఆహారం సరఫరా చేసిన విషయంలో ఇంకా ఎంత మొత్తం చెల్లించాలో వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించగా.. కొంత సమయం ఇవ్వాలని అధికారులు అభ్యర్థించారు.