Suryaa.co.in

Andhra Pradesh

జాతీయ మహిళా కమీషన్ కు వంగపూడి అనిత లేఖ

గోరంట్ల మాధవ్ వీడియోపై జాతీయ మహిళా కమీషన్ కు తెదేపా నాయకురాలు వంగపూడి అనిత లేఖ
• వీడియోను జాతీయ ఫోరోన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయండి.
• మహిళలపై ఇంత అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీపై, ఆయనకు సహకరిస్తున్న పోలీసులపై కఠిక చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ.
• వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయి.
• జగన్ రెడ్డి పాలనలో మహిళలు అభద్రతభావంలోకి నెట్టబడ్డారు.
• జూన్, 2019 నుంచి నేటి వరకు దాదాపు 777 నేరాలు-ఘోరాలు మహిళలపై జరిగాయి.
• మహిళలపై నేరాలు 2020లో 14,603 ఉంటే 2021లో 17,736కి పెరిగాయి.
• అంటే 21.45% పెరిగిపోయాయి.
• మహిళలపై దాడులు చూస్తుంటే నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయి.
• అయినా దిశ చట్టం పేరుతో మహిళలను, సభ్య సమాజాన్ని మభ్యపెట్టేలా జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
• వాస్తవంలో దిశ చట్టమే లేదు.
• మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది.
• వైసీపీ నాయకులే స్వయంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
• వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, బెదిరింపులకు దిగారు.
• వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనైతిక కార్యకలాపాల వీడియోనే ఇందుకు నిదర్శనం.
• సేవ చేసేందుకు ప్రజల ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే వైసీపీ నాయకులు మాత్రం అనైతికమైన జుగుప్సకరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు
• గోరంట్ల మాధవ్ వ్యవహారంపై సరైన విచారణ గానీ, ఫోరెన్సిక్ టెస్ట్ కు గానీ చేయకుండా ఎంపీకి క్లీన్ చిట్ ఇచ్చారు.
• అనంతపురం ఎస్పీ ఫకీరప్ప సరైన విచారణ చేయకుండానే వీడియో మార్పింగ్ చేశారని చెప్పారు.
• మహిళల పట్ల వైసీపీ నేతల అఘాయిత్యాలను కప్పిపుచ్చేందుకే కొంతమంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
• కావున, గోరంట్ల వ్యవహారంపై జాతీయ మహిళా కమీషన్ స్పందించి కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వీడియోను టెస్ట్ చేయాలని కోరుతున్నాను.
• ఏపీ మహిళలపై జరుగుతున్న నేరాలు-ఘోరాలు, వీటిలో అధికార వైసీపీ నేతల పాత్ర, నేతలకు సహకరిస్తున్న కొంతమంది పోలీసులపై సమగ్ర విచారణ జరిపించండి.
• కమీషన్ తీసుకునే సత్వర చర్యలు మాత్రమే ఏపీ మహిళల భద్రతకు భరోసా కల్పిస్తాయి.

LEAVE A RESPONSE