Suryaa.co.in

Andhra Pradesh

కీచకత్వంలో పోటీ పడుతున్న వైసీపీ నేతలు

– విశాఖ జిల్లాలో దివ్యాంగురాలిని అత్యాచారం చేసిన వైసీపీ నేతను నడిరోడ్డుపై ఉరితీయాలి
-తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
కంచే చేను మేస్తే కాపాడేదెవరు? కిరాతకుల కంబంధ హస్తాల నుంచి రక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు, భద్రత కల్పించాల్సిన పోలీసులే భక్షకులైతే ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అకృత్యాలు వైసీపీ ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యాన్ని కళ్లకు కడుతున్నాయి. విశాఖ జిల్లాలో దివ్యాంగురాలపై వైసీపీ నేత వెంకట్రావ్ అత్యచారానికి పాల్పడటం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. కీచకత్వంలో తమకు తామే సాటి అన్నట్టుగా వైసీపీ నేతలi అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కిందిస్థాయి వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకుని ఆడబిడ్డల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
ఏంచేసినా ప్రభుత్వం, పోలీసులు రక్షిస్తారనే ధీమాతో విర్రవీగుతున్నారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగులేసిన వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఎక్కడ? బాధితురాలు ఫిర్యాదు చేసినా నిందితుడు వెంకట్రావ్ పై చర్యలెందుకు తీసుకోలేదు? మహిళల వైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా దిశా చట్టమని మాటల కోటలు దాటించిన ముఖ్యమంత్రి అన్యాయమైపోతున్న ఆడబిడ్డల జీవితాలకు ఏం సమాధానం చెప్తారు. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రోజుకో ఘోరం జరగడం హేయం.
జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎటువైపు నుంచి ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రానాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. నిందితులకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తున్న వారిని శిక్షించడం రాజారెడ్డి రాజ్యంలోనే చూస్తున్నాం. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో గ్యాంగ్ రేప్ ఘటన, దళిత యువతి రమ్య దారుణ హత్య, పాలడుగులో వివాహితపై అత్యాచారం ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటవి ఎందుకు జరుగుతాయి?
తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని చీకటి జీవోలు ఇచ్చుకుంటూ, అవినీతి నోట్ల కట్టలు లెక్కపెట్టడంపై ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రికి మహిళలను రక్షించడంలో లేకపోవడం సిగ్గుచేటు. విశాఖ దివ్యాంగురాలు అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి స్పందించాలి. నిందితుడు వెంకట్రావ్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతాం.

LEAVE A RESPONSE