Suryaa.co.in

Andhra Pradesh

కోనసీమ అల్లర్లవెనక ఎవరున్నారో తెలియడం లేదా?

-మంత్రికొడుకు కృష్ణారెడ్డి, వైసీపీ ఎంపీటీసీని బెదిరిస్తున్నాడంటే కోనసీమ అల్లర్లవెనక ఎవరున్నారో తెలియడంలేదా?
– కోనసీమ విధ్వంసం అంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లో, ఆయన సహాయసహకారాలతోనే జరిగిందనడానికి మంత్రి విశ్వరూప్ కుమారుడి వ్యాఖ్యలే నిదర్శనం. తన అధికారదాహానికి సొంతపార్టీ వారిని బలితీసుకోవడానికి కూడా జగన్ వెనుకాడటంలేదు
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

రాష్ట్రం ఏమైనా, ప్రజలు ఎలాపోయినా తన అధికారదాహానికి వారినిబలిచేస్తూ, శవాలకుప్పల పైనే తనపీఠం ఉండాలన్న దుర్మార్గపుఆలోచనతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడని, దానిలో భాగంగానే పచ్చనికోనసీమ ప్రాంతాన్ని పాకిస్తాన్ లా మార్చాడని, దళితులఓట్లు కొల్లగొట్టడానికి సొంతపార్టీవారి ఇళ్లనేతగలబెట్టించి, తనకుట్రలను టీడీపీ, జనసేనలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు.గురువారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆమెమాటల్లోనే …

“2019 వరకు నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ గా పిలవబడిన రాష్ట్రం, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రావణకాష్టంగా మారింది. రాష్ట్రం ఏమైనా, ప్రజలు ఎక్కడపోయినా ప్రభుత్వానికి పట్టడంలేదు. కోనసీమను చూస్తుంటే పాకిస్థాన్ గుర్తుకొస్తోంది.

జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు కోనసీమప్రాంతం మచ్చుతునకగా నిలిచింది. అధికారదాహాంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైళ్లు తగలబెట్టించారు. కేంద్రప్రభుత్వ ఆస్తులు ధ్వంసంచేసి వారిపై పెట్టే కేసులు చాలాకఠినంగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తునిఘటనలో తనపార్టీవారిపై నమోదైన కేసులన్నీరద్దుచేశాడు.. ఈ ఒక్క ఉదంతంచాలు.. ఆనాటి ఘటనలో ఎవరు సూత్రధారులో, పాత్రధారులో చెప్పడానికి. కాపు ఉద్యమం ముసుగులో ఆనాడు కులరాజకీయాలపై పునాదులు కట్టే, జగన్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడు. అలానే బాబాయ్ హత్యతో శవాలకుప్పలు వేసి, వాటిమీద తనముఖ్యమంత్రి స్థానాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. ఎలాంటి అరాచకంచేసినా.. చేయించినా జగన్మోహన్ రెడ్డి తొలినుంచీ దళితులేలక్ష్యంగా తనకుట్రలు అమలు చేస్తున్నాడు. వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు తనవద్ద డ్రైవర్ గాపనిచేసిన వ్యక్తిని చంపి, శవాన్ని ఇంటికి తీసుకెళితే, టీవీచర్చల్లో వైసీపీవారు అతన్ని సమర్థిస్తూ సిగ్గులేకుండా గౌరవంగా మృతదేహాన్ని తీసుకెళ్లాడనిచెప్పుకుంటున్నారు.

కోనసీమను అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలి అనుకుంటే, ఆపని ఈ ప్రభుత్వం ముందే ఎందుకు చేయలేదు? జిల్లాలప్రకటన వచ్చిన తొలినాళ్లలోనే ఆపేరుపెడితే కోనసీమ తగలబడే దికాదుకదా! ఓటుబ్యాంకుకోసం మరలా అధికారంలోకి రావడానికే వైసీపీప్రభుత్వం జిల్లాపేరుమార్చి సొంతపార్టీ వారి ఇళ్లుతగలబెట్టించింది. కోనసీమలో జరిగిన విధ్వంసం అంతా జనసేన,టీడీపీవారే చేశారని హోం మంత్రి అంటున్నారు. 65మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే, వారిలో 45మంది వైసీపీవారేఉన్నారు. టీడీపీ, జనసేనలు జిల్లారగడలో, కోనసీమ విధ్వంసంలోఉంటే, వైసీపీవారు వారిఇళ్లపైకి వెళ్లకుండా, సొంతపార్టీనేతల ఇళ్లపైకి ఎందుకెళ్లారు?

మంత్రి విశ్వరూప్ కొడుకి బెదిరింపుల ఆడియోనే చెబుతోంది.. కోనసీమ విధ్వంసం అంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగిందని చెప్పడానికి!
మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి, వైసీపీఎంపీటీసీని బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లుకొడుతోంది. మంత్రిగారి అబ్బాయి, వైసీపీఎంపీటీసీని దుర్భాష లాడుతూ, బెదిరిస్తున్నాడంటే కోనసీమ అల్లర్లవెనక ఎవరున్నారో తెలియడంలేదా? దళితుల ఓట్లకోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నికుట్రలు చేసినా ఆయన ఆశనెరవేరదు. కోనసీమ విధ్వంసం అంతా జగన్మోహన్ రెడ్డి సహాయసహాకారాలతోజరిగిందే. సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశాన్ని టీడీపీ, జనసేనలపై రుద్దడానికి చేయాల్సిందంతా చేశారు. టీడీపీవారు అల్లర్లు సృష్టించి విధ్వంసం చేయిస్తే, పోలీసులుచూస్తూ ఊరుకుంటారా? ప్రభుత్వం ఊరుకుంటుందా? సొంతపార్టీ ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి, మంత్రి ఇంటిని తగలబెట్టిన వారు, రేపు అధికారంకోసం ప్రజల్ని తగలబెట్టరా?

టీడీపీ వారిని రెచ్చగొట్టడానికే సజ్జల రామకృష్ణారెడ్డి కుటిల రాజకీయాలు చేస్తుంటారు. పదవిలోఉండగా ఎవరైనా చనిపోతే, వారికుటుంబంలో ఎవరికైనా టిక్కెట్ ఇస్తే టీడీపీ ఆఎన్నికలో పోటీచేయకూడదని చంద్రబాబు ఎప్పుడో నిర్ణయించారు. అది మాపార్టీ ఎప్పటినుంచో అమలుచేస్తున్న నిర్ణయం కూడా. ఆత్మకూరులో దమ్ముంటే పోటీచేయండి అనేవారు ఈవాస్తవం తెలుసుకోవాలి. నిజంగా మీకు దమ్ముంటే, మీ ప్రభుత్వానికి ధైర్యముంటే, ప్రభుత్వం రద్దుచేసి ఎన్నికలకు రండి.. అక్కడే ఎవరేమిటో తేలిపోతుంది. అంతధైర్యం మీకులేకపోతే, ప్రత్యేకహోదాపై మీ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించండి, మాపార్టీ ఎంపీలుకూడా రాజీనామాలు చేస్తారు. ప్రజల్లోకి వెళ్లి ఎవరిబలం ఎంతుందో తేల్చుకుందాం. కేంద్రబలగాలు, కేంద్ర అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే మీ సత్తా ఏమిటో ప్రజలకు తెలుస్తుంది. చంద్రబాబుగారికి తుత్తూత్తూ… బెబ్బెబ్బే రాజకీయాలు తెలియదు. ఆయనేంచేసినా డైరెక్ట్ గానే చేస్తారు. ప్రజల్లో, ప్రజలకోసమే చేస్తారు.

రాష్ట్రంలో జరిగే అత్యాచారాలపై హోం మంత్రిచేసిన వ్యాఖ్యలు చాలాచాలా దురదృష్టకరం.గతంలో రోజా అసెంబ్లీలో మాట్లాడుతూ “ఏంచేస్తారు.. మహా అయితే రేప్ చేస్తారు” అన్నది. అత్యాచారాన్ని కూడా అంతతేలిగ్గా తీసుకునే మనస్తత్వం వారికే ఉంది. ఆత్మాభిమానంతో బతికే ఆడబిడ్డ ఎవరైనా అత్యాచారం అనే మాటవినడానికే సిగ్గుపడుతుంది. అత్యాచారాలను తేలిగ్గా తీసుకునేవారు ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడతారా?

అత్యాచారాలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ నానాయాగీ చేశారంటాడు.. హోంమంత్రేమో తల్లులపెంపకమే కారణమంటుంది. రోజా ఏమో అలామాట్లాడుతుంది. వాళ్లు అసలు మనుషులేనా? అనే సందేహం ప్రజలందరికీ ఉంది.”

LEAVE A RESPONSE