Home » ఆడపడుచుని అవమానిస్తే, సాటి ఆడబిడ్డలుగా తాము స్పందించడమే నేరమా?

ఆడపడుచుని అవమానిస్తే, సాటి ఆడబిడ్డలుగా తాము స్పందించడమే నేరమా?

-భువనేశ్వరమ్మకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించారన్న అక్కసుతో ప్రభుత్వం, టీడీపీమహిళానేతలపైకి పోలీసుల్ని ఉసిగొల్పింది.
• పాలకులు అవినీతి, అక్రమాలను ప్రశ్నించడమే టీడీపీమహిళానేతలు చేసిన తప్పా?
• సెర్చ్ వారెంట్ల్ లేకుండా ఆడబిడ్డలఇళ్లళ్లోక వెళ్లి, వారిని నిర్బంధిస్తారా?
• వారేం నేరంచేశారని పోలీసులను డీజీపీ వారిపైకి పంపాడు.
• బాబాయ్ లను చంపేసి బాత్ రూమ్ ల్లో దాచేసి సాక్ష్యాధారాలు మార్చేశారా?
• టీడీపీమహిళలను లక్ష్యంగా చేసుకొని వారిఇళ్లను, వ్యాపారాలను నాశనంచేశారు.
• మీరు చేసిన దానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఈ రోజునుంచి మీకు అసలైన పూజ ఎలాఉంటుందో చూపిస్తాం.
-టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు వంగలపూడి అనిత
కుటుంబాల్లో ఉన్న సమస్యలకు ఎదురీదుతూనే, రాష్ట్రంకోసం, ప్రజలకోసం తమవంతుగా ఏదైనా చేయాలన్న భావనతో బయటకువస్తున్న మహిళలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ సాయంతో దారుణంగా అణచివేస్తోందని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత ఆరోపించారు. శుక్రవారం ఆమె పలువురు తెలుగుమహిళ నేతలతో కలిసి మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
రాష్ట్రంలో జరుగుతున్నఘటనలు, మరీముఖ్యంగా పాలకులఅవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న మహిళలపై దాడులుచేయించడం దుర్మార్గం. జగన్ రెడ్డి ప్రభుత్వం సైకో ప్రభుత్వ మనిచెప్పడానికి మహిళలపై జరుగుతున్న దాడులే నిదర్శనం. దేవాలయం లాంటి అసెంబ్లీ లో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పుత్రికను అసభ్యపదజాలంతో తూలనాడారు. తిరిగి అదే ప్రదేశంలో మహిళా అభివృద్ధి, సాధికారతకోసం ఉపన్యాసాలిచ్చా రు. తోటి ఆడపడుచుకు జరిగినఅన్యాయంపై కడుపుమండి ప్రశ్నించిన ఆడబిడ్డలఇళ్లపైకి పోలీసులను పంపి వేధిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుఆడపడుచులంతా అసెంబ్లీలో జరిగినదాన్ని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశంపార్టీ మహిళలుగా తాముకూడా మాట్లాడా ము. మాట్లాడామని మాపై తప్పడు కేసులుపెట్టించారు.. నేరస్తులమైనట్టు ఇళ్లల్లో సోదాలు జరిపించారు. సోదాలనెపంతో ఇళ్లల్లోఉన్నవారిపై దాడిచేశారు. చంద్రబాబునాయుడిగారి సతీమణిని దూషించిన కొందరునీచులకు సమాధానంచెప్పారన్న అక్కసుతో టీడీపీ మహిళా నేతలు స్వప్న, విజయశ్రీ, జానకి, తేజస్విని గార్లఇళ్లపైకి ఏకకాలంలో పోలీసులను పంపారు. సోదాలపేరుతో వారిని, వారి కుటుంబసభ్యులను నక్సలైట్లు, టెర్రరిస్టులకన్నా దారుణంగా ఈ పోలీసులు వేధించారు.
గౌరవంగా బతికే కుటుంబాలపైకి పోలీసులు దేనికి సోదాలు చేశారు? వారు చేసిన నేరమేంటి? వారేమన్నా గొడ్డలిపోట్లతో బాబాయ్ లను చంపి, సాక్ష్యాలు తారుమారుచేయడానికి ప్రయత్నించారా? వారుఎక్కడైనా దొంగతనాలు చేశారా? ఏం తప్ప చేశారని టీడీపీమహిళా నేతలఇళ్లలోకి వెళ్లి, సోదాలపేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. పోలీస్ వ్యవస్థ దీనిపై సమాధానంచెప్పాల్సిందే. డీజీపీ గారు ఇలాంటి వికృతాలకు పాల్పడమ ని కిందిస్థాయి పోలీస్ అధికారులకు ఎందుకు ఆదేశాలిస్తున్నారు? మహిళల ఇళ్లపైకి పోలీసు లను పంపించి, వారికుటుంబసభ్యులను బెదిరించి, వారివ్యాపారాలు, భవిష్యత్ దెబ్బతీయ డానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నిస్తున్నా. ఆడబిడ్డలపైనా మీప్రతాపం? ఏ సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలపేరుతో పోలీసులు మహిళానేతల ఇళ్లమీదకు వెళ్లడమేంటి? ఆఖరికి వారిని వాష్ రూమ్ లకు కూడా పోనివ్వకుండా వెంట కానిస్టేబుళ్లను ఉంచుతారా? ఏమిటీ దుర్మార్గం? ఎందుకు ఇంత పోగాలానికి సిద్ధమయ్యారు? మహిళలపై చూపుతున్న ప్రతాపాన్ని ఈ పోలీసులు స్నేహలతను, రమ్యను కాపాడటానికి చూపితే వారు చనిపోయే వారుకాదు. వారిని బలితీసుకున్న దుండగులను పట్టుకోవడం చేతగాలేదు ఈ పోలీసులకు.
రాష్ట్రంలో దిశాపోలీస్ స్టేషన్ ప్రారంభమైనరోజునే అభంశుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడి, చిన్నారిమృతదేహాన్ని అదే స్టేషన్ ముందుపడేశారు. ఆరోజు ఈ పోలీసులు ఏం చేశారు? ఈ దిక్కుమాలిన ప్రభుత్వం బాలికకుటుంబానికి రూ.10లక్షలిచ్చి చేతులుదులు పుకుంది తప్ప, అసలుదోషులను పట్టుకొని శిక్షించలేకపోయింది. ఇలాంటి దమ్ము, చేవలేని పోలీసులను, ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. రాష్ట్రంలో పరిస్థితి కంచెచేను మేసి నట్టుగా ఉంది. రక్షించాల్సి న పోలీస వ్యవస్థే, మానవత్వం లేకుండా ఇలా భక్షిస్తే ఏంచేయాలి ? ఒక ఆడబిడ్డను అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే, టీడీపీలో ఉన్న మేము చూస్తూఊరుకోవాలా? మాపై ఎంతదురుసుగా ప్రవర్తిస్తున్నారో, దానికి పదింతలఉత్సాహంతో పనిచేస్తాం. ఈరోజు నుంచి మీకు అసలుపూజ మొదలవతుందని హెచ్చరిస్తున్నాం. సెర్చ్ వారెంట్ లేకుండా ఎప్పుడు సెర్చ్ చేస్తారో పోలీసులకు తెలియదా? హత్యానేరాల్లోనో, లేక ఇతరత్రా సంఘవిద్రోహచర్యలకు పాల్పడితేనో అలాచేయాలి. టీడీపీమహిళానేతలకు సీఆర్పీ సీ 41 నోటీసుఇచ్చి, విచారించి పంపకుండా, ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారా? ఆ సమయంలో పోలీసులు మమ్మల్ని ఉద్దేశించి విచిత్రంగా మాట్లాడారు. ఎవరైనా చెబితేమాట్లాడారా..లేక డబ్బులిచ్చారా అని ప్రశ్నించారు. అలాచేయడానికి మేమేమీ వైసీపీ పేటీఎమ్ కుక్కలం కాదు . ఎవరైనా అలా మాట్లాడమని మిమ్మల్ని ప్రేరేపించారా అని అడగడానికి పోలీసులుకు సిగ్గు గా లేదా? వైసీపీ వెధవలకు, పోలీసులకు ఎలాచెప్పాలో అలానే సమాధానంచెబుతాం.
పైనుంచి ఒత్తిడి ఉందని అందుకే సోదాలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు : స్వప్న (రాష్ట్ర తెలుగుమహిళ జనరల్ సెక్రటరీ)
భువనేశ్వరమ్మకు జరిగిన అవమానంపై ప్రశ్నించినందుకు మమ్మల్ని వేధింపులకు గురిచేస్తున్నారు. నిన్న (25.11.2021) ఉదయం 15మందికి పైగా పోలీసులు మా ఇంటికి వచ్చి సెల్ ఫోన్లు తీసేసుకున్నారు. కార్ సీజ్ చేశారు. ఇంత పొద్దునపూట ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే పట్టించుకోకుండా సోదాలు చేశారు. బాత్ రూమ్ లో కూడా తనిఖీలు చేశారు. ఇలా మాట్లాడమని మిమ్మల్ని ఎవరన్నా ప్రోత్సహించారా, డబ్బులిచ్చారా అని నోటికొచ్చినట్టు మాట్లాడారు. డాక్యుమెంట్లు తాక్కున్నారు. పై నుంచి వారిపై ఒత్తిడి ఉందని పోలీసులు చెప్పారు. మేము హత్య చేశామా? నా భర్తతో కలిసి రోడ్డుపై ఆందోళనకు దిగాను. చట్టాలు అధికార పార్టీకి చుట్టాలుగా మారిపోయాయి. పోలీసుల తీరు దారుణంగా ఉంది. ఒక రిజిస్ట్రేసన్ కోసం ఇంట్లో మేము రూ. 4 లక్షలు అందుబాటులో ఉంచుకుంటే వాటినీ సీజ్ చేసేశారు. రూ. 4 లక్షలను రూ. 80 లక్షలుగా ట్రీట్ చేశారు. మీ వేధింపులు ఆపకపోతే బిల్డింగ్ పై నుంచి దూకేస్తానని చెప్పాక పోలీసులు ఆగారు. జరిగిన ఘటనపై పరువు నష్టం దావా వేస్తాం. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాం. ఎన్ని వేధింపులకు గరిచేసినా, అక్రమ అరెస్ట్ లు చేసినా భయపడం . మహిళా లోకం రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి చంద్రబాబునాయుడు గారిని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపుతాం.
మమ్మల్ని ఎంతబెదిరించినా కచ్చితంగా ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతూనే ఉంటాం : తేజస్విని, టీడీపీ మహిళానేత పోలీసులు మా ఇళ్లలోకి చొరబడి సోదాలు చేశారు. మా వ్యాపార సంస్థలపైనా సోదాలు చేశారు. మేమేమైనా క్రిమినల్సా? సెర్చ్ వారెంట్ లేకుండా ఎలావస్తారని ప్రశ్నిస్తే మాఇష్టమని పోలీసులు అంటున్నారు. పోలీసుల ఉన్నది సామాన్య ప్రజలకోసమా అధికార పార్టీ నేతలకోసమా? మమ్మల్ని ఎంత బెదిరించనా భయపడం. ఖచ్చితంగా ప్రభుత్వ అరాచకాలపై పోరాడతాం. ఎన్నికేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. 2024లో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేస్తాం. మహిళను కంటతడి పెట్టించిన ఏ రాజ్యమూ బాగుపడలేదు. మాకన్నీటికి కారణమైన వైసీపీప్రభుత్వం మట్టికొట్టుకుపోతుంది.
మహిళా శక్తి ఏంటో జగన్ కు చూపిస్తాం : విజయశ్రీ (అనంతపురం నగర టీడీపీఅధ్యక్షురాలు)
మేము ఎక్కడా చట్టాలను అతిక్రమించలేదు. అయినా పోలీసులు దురుద్దేశంతో మమ్మల్ని వేధింపులకు గురిచేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు చేశారు. పై నుంచి ఆర్డర్స్ రావడంతో తామేమీ చేయలేమని లోపలికి చొరబడ్డారు. ఏదో ఒక విధంగా మాపై కేసు ఫైల్ చేయాలని వచ్చారు. ఇన్నాళ్లూ టీడీపీ నేతలను వేధింపులకు గురిచేశారు. అక్రమ అరెస్ట్ లు చేశారు. ఇప్పుడు మహిళలపై పడుతున్నారు. మహిళాశక్తి ఏంటో, దాని ప్రభావం ఎలాఉంటుందో జగన్ కు చూపిస్తాం. నేను టీడీపీ ప్రభుత్వంలో కార్పొరేటర్ ని. నా భర్త రేషన్ డీలర్. ప్రభుత్వం మారిన వెంటనే ఆ స్టోర్ లాగేసుకున్నారు. 150 ఎకరాలు మాకుఉంటే దాన్ని లాక్కునేందుకు ప్రయత్నించారు. అయినా మేం భయపడలేదు. నిన్నటి ఘటనలో మా డివిజన్ ప్రజలంతా మాకు అండగా నిలబడ్డారు. చంద్రబాబు గారి కోసం మా ఆస్తిని, ప్రాణాలను సైతం ఇస్తాం. కౌరవులు ఎలా రాజ్యాన్ని కోల్పోయారో అదే విధంగా వైసీపీ కూడా మట్టి కరవడం ఖాయం.
మా నోళ్లు నొక్కేస్తే ఏ ఆడబిడ్డా బయటకు రాదన్న ప్రభుత్వ ఉద్దేశం ఎన్నటికీ నెరవేరదు : జానకి (టీడీపీ మహిళానేత)
నేనుగతంలో కార్పొరేటర్ గా పనిచేశాను. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీనుండి టీడీపీలోకి వచ్చాను. చంద్రబాబు గారి పాలన ఆయన ఆలోచన నచ్చి ఈ పార్టీలోకి వచ్చాను. కార్పొరేటర్ గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాను. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిపై నిందలువేస్తే చూస్తూ ఊరుకోవాలా? తోటి మహిళలుగా మాకు బాధుఉండదా? ఆ ఉద్దేశంతోనే మేం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాము. దానికే మాపైకేసులుపెట్టారు. మీరు ఎన్నిఅక్రమకేసులు పెట్టినా భయపడం. ఒకేసారి 5గురు సీఐల నేతృత్వం లోని పోలీసులు మా ఇంటిలోకి వచ్చారు. మాకు ఆర్డర్స్ వచ్చాయి.. మీ ఇల్లు సోదాచేయాల న్నారు. మా అభిప్రాయం మేం చెప్పామనిచెప్పినా, ఆత్మాభిమానానికే కట్టుబడతామన్నా పోలీసులు వినలేదు. మీరు మాకుసహకరించకపోతే బలవంతంగా తీసుకెళ్లాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. మాకు ధైర్యంగాఉండాలని టీడీపీ నాయకత్వం ధైర్యంచెప్పింది. అరాచకపాలనకు వ్యతిరేకంగా గళం వినిపిస్తాం. పార్టీగెలుపుకోసం కష్టపడతాం. సేవాభావంతో ఒకపార్టీలో ఉండి ప్రజలకోసం పనిచేయడం మా తప్పా? పోలీసులు రావడంపై మాఇళ్లచుట్టుపక్కలఉన్నవారు, మమ్మల్ని పలురకాలుగా ప్రశ్నిస్తున్నారు. అదే కాస్త బాధగా ఉంది. ఈ ప్రభుత్వం పనితీరు ఎలాఉందో ఇప్పటికే ప్రజలకు బాగా అర్థమైంది. వైసీపీప్రభుత్వానికి బుద్ధిచెప్పేలా ప్రజలను చైతన్యంచేస్తాం. మా నోళ్లునొక్కేస్తే ఇక ఏ ఆడబిడ్డా బయటకు రాదన్నది ప్రభుత్వ ఉద్దేశం. అది ఎన్నటికీ జరగదు.

Leave a Reply