Suryaa.co.in

Telangana

కుర్చీ కిక్కెక్కి పిచ్చెక్కిన రేవంత్

-చేవెళ్ల సభలో చిల్లర ప్రవర్తన
– బూతులు.. బెదిరింపులతో బరితెగుంపు
– డైలాగ్ లతో గోల్ మాల్ కుట్ర
– రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

అసాధ్యమనుకున్న అధికారం ఆయాచితంగా అందండంతో ,అహంకారం ఆవహించి సీఎం రేవంత్ రెడ్డి సోయి లో లేకుండా పోయారని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ విమర్శించారు. తాగుబోతులు నీషా ఎక్కువై వాగినట్టు,కుర్చీ కిక్కెక్కి రేవంత్ కు పిచ్చెక్కిందని ద్వజమెత్తారు. చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర సంపద పెంచిన కేసీఆర్ ,దాన్ని తెలంగాణ ప్రజలకు పెట్టుబడిగా పంచి,పంటల విప్లవం సాకారం చేశాడని అన్నారు. తొమ్మిదేళ్ల లో రెండేళ్ల కరోనా కష్టాలు, కేంద్ర ఇబ్బందులు తట్టుకొని ఒక్క రైతు బంధు ద్వారానే 85 లక్షల మంది రైతులకు 83వేల కోట్ల రూపాయలను కేసీఆర్ సర్కార్ పంచిందన్నారు.2కోట్ల18లక్షల టన్నుల వరి ధ్యానం ఉత్పత్తి తో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను నాటి సీఎం కేసీఆర్ ఎదిగించారన్నారు.

2014లో 7,778మెగావాట్ల రాష్ట్ర స్థాపిత విద్యుత్ స్థామర్ధ్యాన్ని,పదేళ్ల లోనే 17,234 మెగావాట్ల కు పెంచి, విద్యుత్ వెలుగులవనంలా తెలంగాణను మార్చివేసింది బీఆర్ఆఎస్ ప్రభుత్వమేనని వివరించారు. ఎదిగిన తెలంగాణ మీద వాలిన రాజకీయ రాబందులా రేవంత్ సర్కార్ ఆర్థిక వ్యవస్థ తో చెలగాటమాడుతున్నదని ఆవేదన వెలిబుచ్చారు. గ్యారెంటీ లలో గోరంత అమలు చేస్తూ,ఎగ్గొడుతున్న కొండంత హామీలపై జనం దృష్టి మళ్ళకుండా ,తిట్లతో కాంగ్రెస్ సర్కార్ గోల్ మాల్ గేమ్ ఆడుతున్నదని విమర్శించారు.

హిమాచల్ ప్రదేశ్ హస్తం సర్కార్ కొన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్నదని,కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ రేపోమాపో అన్నట్లున్నదని,పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ క్యాబినెట్ లో కూడా కిక్ బాక్సింగ్ ఖాయమని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ లను ఎవరూ కూల్చరని,భస్మాసురుల్లా వారి ప్రభుత్వ తలపై వారే చెయ్యేసుకొని పడేసుకుంటారని అన్నారు.

అయినా సీఎం లా హుందాగా ప్రవర్తించకుండా సమరసింహారెడ్డి సినిమా డైలాగ్ లతో రేవంత్ పరువును బజారునేసుకున్నాడని దుయ్యబెట్టారు.అమేథీలో ఎంపీ గా వోడిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కి పనికిరాడని రేవంత్ ప్రకటిస్తే,తాజా ఎంపీ ఎన్నికల సవాల్ కు అర్థముంటుందని ఆంజనేయ గౌడ్ ఎద్దేవా చేశారు .

LEAVE A RESPONSE