అంజనీకుమార్‌ సస్పెండ్

– డిజిపి రవిగుప్తా ను నియమిస్తూ ఉత్తర్వులు
– రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన కారణం

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) అంజనీ కుమార్ సస్పెండ్ అయిన కొన్ని గంటల తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవి గుప్తాను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

1990 బ్యాచ్‌కు చెందిన అధికారి, గుప్తా డిసెంబర్ 2022లో అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరియు డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు

డీజీపీ అంజనీకుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన కొద్ది గంటలకే రవిగుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఆదివారం మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన కారణంగా అంజనీకుమార్‌ను సస్పెండ్ చేశారు.

Leave a Reply