– కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
అమరావతి : గూగుల్ సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం విశ్వనగరంగా ఎదిగేందుకు మరో అడుగు ముందుకు పడిందని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ ల కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా లోకేష్ 12 నెలల కృషి నేడు గూగుల్ పెట్టుబడులని సాధించాం… వికసిత్ భారత్ లక్ష్యానికి ఈ కొత్త సాంకేతికత ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని సుభాష్ వ్యక్తం చేశారు.
గూగుల్ సంస్థ విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు తో విశాఖపట్నం గేమ్ చేంజర్ గా మారబోతోం దని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అంటే ఐటీ.. ఐటీ అంటే విశాఖనగరం రూపుదిద్దుకోబోతోందని ఆయన తెలిపారు. ఏఐ టెక్నాలజీని సైతం విశాఖకు నిలయంగా మలిచే ప్రయత్నంచేస్తున్నముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బలమైన పునాదులు వేస్తున్నారని మంత్రి సుభాష్ కొనియాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల పాలనలో ఏకంగా దాదాపు 11లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, ఒక్కగూగుల్ సంస్ధే లక్ష33 వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతోందంటే అది బాబు గ్యారెంటీకి దిక్సూచిగా నిలుస్తుందని వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి పథంలో సాగుతున్నవిశాఖ రూపురేఖలు ఈ డేటా సెంటర్ తో పూర్తిగా మారిపోతాయన్న ఆకాంక్షను సుభాష్ వ్యక్తం చేశారు.
అటు ఉత్తరాంధ్ర వారికే కాకుండా కోస్తా జిల్లాలోని ఐటి నిపుణులకు ఈ సెంటర్ ద్వారా ఉపాధిలభిస్తుందన్నారు.
భారత డిజిటల్ ఎకానమీని సమూలంగా మార్చేందుకు ఈ కేంద్రం ప్రేరకం అవుతుందని మంత్రి… చంద్రబాబు చొరవ, లోకేష్ శ్రద్దాశక్తులకు మంత్రి సుభాష్ అభినందనలు తెలిపారు.