ఖమ్మంలో పార్టీ బహిరంగసభకు హాజరైన కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాకు ఏపీ బీజేపీ నేతలు స్వాగతం పలికారు. పార్టీ మీడియా ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో పార్టీ నేతలు అమిత్‌షాను ఎయర్‌పోర్టులో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వెంకటేశ్వరస్వామి ప్రతిమతో పాటు, దేశవాళీ ఆవునెయ్యిని పాతూరి నాగభూషణం బహుకరించారు. రాష్ట్ర పార్టీ నేతలు యామినీ శర్మ, పాటిబండ్ల రామకృష్ణ తదితర నేతలను ఆయనకు పరిచయం చేశారు. ఆయనకు పరిచయం చేశారు.