Suryaa.co.in

Andhra Pradesh

ఏపిలో బిజెపి శాఖ నర్తనశాల పాత్ర పోషిస్తుంది

– రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ మేడా శ్రీనివాస్
కాషాయం ముసుగులో దేశ భద్రతను స్వప్రయోజనాలకు దారి చేసుకుంటున్న ప్రధాని మోదితో భారతదేశ మనుగడకు పెనుప్రమాదం పొంచి వుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
ప్రధానిగా మోది గద్దెనెక్కిన నుండి దేశ వ్యాప్తంగా పేదరికం, తీవ్రవాదం అంచెలంచెలుగా పెరుగుతుందని, డిజిటలైజేషన్ అంటు ప్రజల పొదుపు సొమ్మును కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని,స్వచ్ఛభారత్ పేరుతొ నిధులను దారిమళ్లిస్తు సొంతప్రయోజనాలు పొందుతున్నారని, ప్రధానిగా మోది ప్రమాణ స్వీకారం చేసిన నుండి శ్రమ దోపిడీకి అనధికార లైసెన్స్ జారీచేసినట్టుగా ఆర్థిక బకాసురులు చెలరేగి పోతున్నారని, వేలకోట్లు బ్యాంకుల నుండి దోచుకున్న ఆర్ధిక నేరగాళ్లలో అధిక శాతం బిజెపి (మోది)సన్నిహితులని, నీరవ్ మోడి, విజయమాల్యా వంటి ఎందరో ఆర్థిక నేరగాళ్ళను దేశం విడిచి పారిపోయే విధంగా అధికార దుర్వినియోగంకు మోది పాల్పడుతున్నారని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని పెట్టుబడి దారులకు “సీఈఓ”లా పనిచేస్తున్నారని, మోది పాలనలో దేశ అంతర్గత భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు.
మోది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, వనరులు పైన దుర్బుద్ధి తో వున్నారని, ప్రాణాలర్పించి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్లకు కాట్టబెట్టే కుయుక్తులు చేస్తున్నారని, విశాఖపట్నం కు రైల్వే జోన్ ఇస్తానని నమ్మించి జోన్ రాకపోయే రైల్వే డివిజన్ ను తరలించుకు పోయే కుట్రలకు ఆజ్యం పోస్తున్నారని, మరో ప్రక్క రైల్వే ను, టెలి కమ్యూనికేషన్ ను, నేషనల్ హై వేస్ ను, పోస్టల్ సర్వీస్ ను ఇలా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే కుట్రలు సాగిస్తున్నారని, మోది దృష్టిలో అంబానీ, ఆదానీలు మాత్రమే మనుషులని, మిగిలిన అందరు బానిసలుగానే పరిగణించటం ప్రజల దురదృష్టం అని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు.
కరోనా విపత్తు సమయంలో కూడా వేక్సినేషన్ డ్రైవ్ ను సొమ్ము చేసుకోవాలనే నీచ బుద్ది మోది సర్కార్ దని, వేక్సిన్ పేరుతొ మోది సర్కార్ లక్షల కోట్లు ప్రైవేట్, కార్పొరేట్లకు ప్రజల సొమ్మును దోచిపెట్టిందని ,విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన మోది సర్కార్ ప్రజలను నిలువ దోపిడి చేసిందని, మోది సర్కార్ రాజకీయ ప్రయోజనాలుకు రక్షణ శాఖను కూడా రాజకీయ ప్రయోజనాలుకు వినియోగించుకుంటుందని, ఆదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రోత్సహించటానికి మోది సర్కార్ వ్యూహాత్మకంగా బొగ్గును కుత్రిమ కొరతగా సృష్టించి విధ్యుత్ అంతరాయానికి కారకులైతున్నారని, ఆ ముసుగులో రాష్ట్రాలను బ్లాక్ మెయిల్ చేస్తు మోది రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, ఓడ రేవులను ఆధాని కి కట్టబెట్టి మాధకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారం ను కేంద్ర ప్రభుత్వం అనాదికారికంగా ప్రోత్సహిస్తుందని , ఆంధ్ర రాష్ట్రం పై మోది సర్కార్ కాలకూట విషం చిమ్ముతుందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్త పరిచారు.
ప్రజల ఆదాయ మార్గాలపై కేంద్ర ప్రభుత్వం నిరంతర కుట్ర సాగిస్తుందని, నెలకు రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుందని, కరోనా విపత్తు సమయంలో కూడా క్రూడాయిల్ ధరలను విచక్షణా రహితంగా పెంచిందని, వంటగ్యాస్ ధరలను ఏడాది 5 సార్లు పెంచి సామాన్యులపై బారి స్థాయిలో ఆర్ధిక బారాన్ని మోపుతున్నారని, కేంద్ర పరిధిలో వున్న అన్ని రకాల పన్నులను గోప్యంగా పెంచుకుంటు పోతున్నారని, రైల్వే, విమాన రవాణా చార్జీలను ఆకాశాన్ని అంటుకునే విధంగా పెంచుకుంటు పోతున్నారని, ఓ ఎన్ జి సి అభివృద్ధి ని నీరుగారుస్తు ఆ సంస్థ చేపట్టిన లక్షల కోట్ల విలువైన అన్వేషణలను రిలయన్స్ వంటి విదేశీ సంస్థలకు దారాదత్తం చేస్తు ఆక్రమ సంపాదన ఆర్జిస్తున్నారని, నేడు భూ గర్భ జలాలు, సముద్ర జలాలు కలుషితం కావటానికి, పర్యావరణం విష తుల్యంగా మారటానికి, తుఫాన్, సునామి ల వంటి విపత్తులు అకారణంగా సంభవించటానికి ప్రధాన కారణం మోది సర్కార్ అధికార దుర్వినియోగం, ప్రైవేట్, కార్పొరేట్ల అశాస్త్రీయ త్రవ్వకాలే కారణం అని ఆయన పేర్కొన్నారు.
ప్రజలను బిక్షగాళ్ల గా మార్చటమే మోది సర్కార్ రాజకీయ ప్రధాన ఎజెండా అని, నేటి మోది (బిజెపి)సర్కార్ కాషాయం ముసుగులో వున్న తాలిబన్ లు వంటి వారని, ఆంధ్రప్రదేశ్ లో వున్న బిజెపి నేతలు మోది సర్కార్ కు భజన చేసే నర్తనశాల లని, ప్రత్యేక హోదా, విభజన హామీలకు మోది చేసిన ద్రోహం ను ప్రశ్నించే దమ్ము, సత్తా వున్న నేత ఆంధ్ర బిజెపి లో లేరని, ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తు తెలుగు రాష్ట్రాల విలువైన సంపదను కేంద్ర ప్రభుత్వం దోచుకుపోతుందని, మోది సర్కార్ ను గద్దె దించకపోతే భారతదేశ సార్వభౌమత్వానికి పెను ప్రమాదం పొంచి వుందని, మోది (బిజెపి)సర్కార్ ను గద్దె దించటానికి ఏపిలో గల అన్ని ఉద్యమ రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు ఏకం కావాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. సభకు ఆర్పిసి సీనియర్ సెక్యులర్ డివిఆర్ మూర్తి అధ్యక్షత వహించారు.

LEAVE A RESPONSE