బన్నీ ఉత్సవం మళ్లీ హింసాత్మకం

కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవం ఈ ఏడాది కూడా హింసాత్మకంగా మారింది. కర్రలతో రక్తం వచ్చేలా కొట్టుకునే ఈ పండుగ అనుమతిపై, చాలా ఏళ్ల నుంచి అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. అయినా సంప్రదాయం, భక్తి, నమ్మకం పేరుతో ఆ జాతరను ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ జాతరలో స్థానికులు కర్రలతో ఒకరిపై ఒకరు పోరాడతారు. ఆ సందర్భంలో చాలామంది అక్కడికక్కడే చనిపోవడం, తలలు పగలడం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం ఆనవాయితీగా మారింది. తాజాగా జరిగిన బన్నీ జాతరలో మళ్లీ అవే దృశ్యాలు దర్శనమిచ్చాయి. వేలాదిమంది హాజరయిన ఈ ఉత్సవంలో కర్రల దాడులతో దాదాపు వంది మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలవగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Reply