వైసీపీ ప్రభుత్వం కాగ్ కు సమర్పిస్తున్నవన్నీ తప్పుడు లెక్కలే…

– వైసీపీ ప్రభుత్వం మొత్తం రూ.66 వేల కోట్ల అక్రమాలకు పాల్పడింది.
– అప్పులను, ఖర్చులను కాగ్ మంత్లీ కీ ఇండికేటర్స్ లో తక్కువ చేసి చూపించారు.
– ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏ మాత్రం పారదర్శకత ఉన్నా అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి. రెడ్డి

అప్పులపై చర్చకు వచ్చే దమ్ము, ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి లేదని, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీ అప్పు తక్కువే అని కాగ్ చెప్పినట్లు సాక్షి దినపత్రికల్లో తప్పుడు వార్తలు ప్రచురించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశం అన్నారు. విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. బడ్జట్ లో రూ.37,029 వేల కోట్లు పెట్టి చేసిన అప్పు రూ. 25,194 కోట్లే చేశామని పచ్చి అబద్దాలను నిసిగ్గుగా సాక్షి పత్రికలో రాసుకున్నారన్నారు.

కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్స్ లో పిబ్రవరి, 2022 నాటికే ఏపీ అప్పు రూ.51,112 కోట్లు ఉంది. ఇంత అప్పు మార్చి 2022 నాటికి రూ. 25 వేల కోట్లకు ఎలా తగ్గింది? దొంగ లెక్కలకు అలవాటు పడ్డ వైసీపీ ప్రభుత్వం కాగ్ కు కూడా దొంగలెక్కలు ఇచ్చి మోసం చేస్తోంది. పబ్లిక్ అకౌంట్ లో చెల్లించిన అప్పును మెయిన్ అకౌంట్ లో తగ్గించి చూపించారు. పబ్లిక్ డెట్ కు మెయిన్ డెట్ కు ఏ మాత్రం సబంధం లేదు. పబ్లిక్ అకౌంట్ అంటే ప్రజలు దాచుకునే అకౌంట్. ఇందులో ప్రజలు దాచుకుంటూ… ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి 2021-22 లో రూ. 1,00,293 కోట్లు చెల్లించామని తప్పుడు లెక్కలు చూపించారు. ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు కూడా కాగ్ కు సమర్పించలేదు.

ఏపీ అప్పులు తెలంగాణ కంటే కూడా తక్కువేనని పచ్చి అబద్దాలను తాటికాయంత అక్షరాలతో సాక్షి పత్రిక రాసింది. తెలంగాణ అప్పు ఫిబ్రవరి, 2022 నాటికి రూ. 43 వేల కోట్లైతే మార్చికి రూ. 47,690 కోట్లు అయ్యింది.. ఫిబ్రవరికీ మార్చికి తెలంగాణలో అప్పులు పెరిగిన లెక్క ఏపీలో కూడా పెరగాలి గానీ తగ్గటం ఏంటీ? వైసీపీ వారు చూపిస్తున్న ఈ తగ్గుదల వారు కాగ్ కు ఇచ్చిన దొంగ లెక్కల ఫలితమే. దేశంలో ప్రతీ రాష్ట్రంలో ఫిబ్రవరి కంటే మార్చి అప్పు ఎక్కువగానే ఉంది. మరీ ఒక్క ఏపీలోనే ఎందుకు తక్కువ వచ్చిందో ప్రజలు అర్ధం చేసుకోవాలి.

2021-22 ఆర్ధిక సంత్సరంలో కేవలం ఆర్బీఐ ద్వారానే రూ. 25 వేల కోట్లు అప్పు వైసీపీ ప్రభుత్వం చేసింది. ఇది కాక కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు ఉంది. అప్పులపై సమాచారం ఇవ్వడం లేదని కాగే స్వయంగా తన రిపోర్టులో రాసింది. 2021 లో రూ.41 వేల కోట్లకు బిల్లులు లేవని కాగ్ వైసీపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై కూడా కాగ్ కు ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. లక్ష కోట్లు అసెంబ్లీకి తెలియకుండా ఖర్చు పెట్టిన సమాచారం కేంద్ర ప్రభుత్వం అడిగినా వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాధానం లేదు. ఈ డబ్బంతా ఏం చేశారో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి.

ఇన్ని అప్పులు చేసినా వైసీపీ ప్రభుత్వం సంక్షేమం కూడా ఏమంత గొప్పగా చేయడం లేదు. అమ్మఒడి పథకంలో దాదాపు ఇరవై లక్షలమంది లబ్దిదారులను తొలగించారు. కరెంటు ఛార్జీలతో సహా ప్రతీ దానిపై పన్నుల బాదుడు బాదుతున్నారు. జర్నలిజం విలువలు గురించే మాట్లాడే సాక్షి పత్రిక తప్పుడు సమాచారంతో, దొంగ లెక్కలతో ఏపీ అప్పు మిగతా రాష్ట్రాలతో పోల్చితే తక్కువని రాస్తుంది బుద్ది, జ్ఝానం ఉన్న ఎవరూ ఇలా రాయరు. పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ రూ.41 వేల కోట్లకు లెక్కలు చెప్పమని లేఖలు రాసినా ఇంత వరకు చెప్పలేదు. కాగ్ కు మే మొదటి వారానికి సమర్పించాల్సిన లెక్కలు జూన్ 15 వ తారీఖున ఇచ్చారు. అదీ కూడా దొంగ లెక్కలు సమర్పించారు. ఏ రాష్ట్రానికి లేని వెసులుబాటు ఒక్క ఏపీకి మాత్రమే కాగ్ ఎందుకిస్తుంది? కాగ్, వైసీపీ ప్రభుత్వం కలిసి కావాలనే డిలే చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం అప్పుల్లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. కార్పొరేషన్ అప్పులు కూడా కలిపేతే దేశంలో రాష్ట్రం అప్పుల్లో మొదటి స్థానంలో ఉంటుంది. దొంగ లెక్కలు చూపిస్తూ పారదర్శకత గురించి మాట్లాడే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి గానీ, ముఖ్యమంత్రికి గానీ లేదు. ముఖ్యమంత్రి పారదర్శకంగా వ్యవహరిస్తుంటే అప్పులకు సంబంధించిన జీవోలను ఎందుకు బయటపెట్టడం లేదు? ప్రజలకు సంబంధించిన అంశాలను కూడా వైసీపీ ప్రభుత్వం దాచిపెడుతోంది.

అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్న బయట పెట్ దమ్ము వైసీపీ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రం చేసిన ఖర్చుల్లో కూడా వైసీపీ ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతోంది. ఫిబ్రవరి, 2022 నాటికి ఖర్చులు రూ. 1,68,000 కోట్లు ఉంటే మార్చికి రూ. 1,58,000 కోట్లు చూపించారు. ఇదెలా సాధ్యం. మార్చి మాసంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు లేవా? ఒక నెలలో ప్రభుత్వానికి దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు ఉంటుంది. ఇది చూపించకపోగా తగ్గించి ఎలా చూపుతారు? దేశంలో అన్ని రాష్ట్రాలో ఖర్చులు పిబ్రవరి కంటే మార్చికి పెరిగాయి. ఒక్క ఏపీలో తప్పా. ఇదంతా వైసీపీ ప్రభుత్వ దొంగలెక్కల ఫలితమే. వైసీపీ ప్రభుత్వం దొంగ లెక్కలతో ప్రజలను, ప్రతిపక్షాలను, కాగ్ ను, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టిస్తోంది. ఏపీ అప్పు ఇప్పటికే ఉన్న సమాచారం మేరకు రూ. 8,20,000 కోట్లకు చేరింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికే రూ. 28 వేల కోట్ల అప్పులు చేశాడు. గతంలో రూ. 41 వేలు కోట్లు, ప్రస్తుత రూ. 25 వేల కోట్లు కలుపుకుని మొత్తం రూ.66 వేల కోట్ల ప్రాడ్ కు వైసీపీ ప్రభుత్వం పాల్పడింది.. ఈ డబ్బంతా ఏమైందో ప్రజలకు చెప్పాలి. ప్రతిపక్షాలు చెప్పేవి అవాస్తవాలైతే వైసీపీ ప్రభుత్వం అప్పులపై సమాచారం ఎందుకు బయట పెట్టడం లేదు.

ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు అవాస్తవాలని వైసీపీ మంత్రులు నాయకులు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిరూపించగలరా? వైసీపీ దొంగలెక్కలతో తెలుగుదేశం పార్టీకి మాత్రమే నష్టం కాదు. వైసీపీ వారితో పాటు రాష్ట్రంలోని ప్రతీ పౌరుడు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ వాస్తవాన్ని గమనించి వైసీపీ నాయకులైన తమ నిజాయితీని, పారదర్శకతను నిలబెట్టుకుందామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నిలదీయాలి.. దీనిపై వైసీపీ పే-టీఎం బ్యాచ్ కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నిలదీయాలి. రాష్ట్రం శ్రీలంకను మించి అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరో నాలుగైదు నెలల్లో రాష్ట్రం పూర్తిగా దివాల తీయనుంది. రాబోయే ఆర్ధిక సంక్షోభాన్ని గుర్తించి ప్రజలు వైసీపీ నాయకులను నిలదీయాలి. ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలనే కాకుండా రాష్ట్ర సమస్యలను కూడా పట్టించుకుని గడపగడపకు వస్తున్న వైసీపీ నాయకుల కాలర్ పట్టుకుని అడగాలని విజ్జప్తి చేస్తున్నాను.