Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర గృహ నిర్మాణ,పట్టణాభివృద్ధి శాఖ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

– వాతావరణ ఆధారిత సంస్కరణలు,జాతీయ స్థాయిలో బలోపేతం
అమరావతి: వాతావరణ ఆధారిత సంస్కరణలు,జాతీయ స్థాయిలో బలోపేతం పై కేంద్ర గృహ నిర్మాణ,పట్టణాభివృద్ధి శాఖ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది..రాజస్థాన్ లోని జైపూర్ లో జరుగుతున్న 12 వ ఆసియా పసిఫిక్ ఉన్నతస్థాయి ప్రాంతీయ 3R(రెడ్యూస్,రీ యూజ్,రీ సైకిల్) సర్కులర్ ఎకానమీ ఫోరం సదస్సు లో ఈ ఒప్పందం జరిగింది.

కేంద్ర గృహ నిర్మాణం,పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సుకు పలు దేశాల ప్రతినిధులతో పాటు ఏపీ ప్రతినిధులు హాజరయ్యారు.కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి ،చైర్మన్ పట్టాభిరాం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

సమీకృత వ్యర్థాల నిర్వహణ,వాతావరణ సంస్కరణలు,పర్యావరణ పరిరక్షణ,సర్కులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు..మూడు రోజుల పాటు జరుగుతున్న సదస్సులో మంత్రి నారాయణ మంగళవారం పాల్గొనున్నారు..మొదటి రోజు వేస్ట్ మేనేజ్మెంట్ పై ఎక్కువగా చర్చ జరిగింది.. జపాన్ దేశంలో వ్యర్థాల నిర్వహణ,అక్కడ ఉపయోగిస్తున్న సాంకేతికత పై ఆ దేశపు అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టభిరాం చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

LEAVE A RESPONSE