అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఏపీ

0
92

-పార్లమెంటు వేదికగా రాష్ట్రం పరువుతీసిన జగన్ రెడ్డి
-గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యంతో యువత భవిష్యత్ నాశనం
-చంద్రబాబు పాలనలో ఏజెన్సీలో కాఫీ తోటల సాగుచేస్తే..జగన్ రెడ్డి పాలనలో గంజాయి సాగవుతోంది
-యువతకు ఉపాధిని దూరం చేసి, డ్రగ్స్,మద్యానికి బానిసలుగా చేస్తున్న జగన్ రెడ్డి
– టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి

రాష్ట్ర అభివృద్థికి, సంక్షేమానికి పాటుపడతారని ప్రజలు విశ్వసించి అధికారాన్ని ఇస్తే జగన్ రెడ్డి తన సహజశైలిలో ఆంధ్రప్రదేశ్ ని మత్తు ఆంధ్రపదేశ్ గా మార్చేశారు. డ్రగ్స్, గంజాయి, ల్యాoడ్, శాండ్, వైన్, మైన్, రెడ్ శాండిల్ మాఫియాలకు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చి ప్రజల్ని దోచుకుంటున్నారు. ముంద్రా పోర్టు నుండే కాదు నలుదిక్కుల నుండి హెరాయిన్‌, కొకైన్‌, గంజాయి వంటి భయంకర మత్తు పదార్ధాలు రాష్ట్రంలోకి చొరబడుతున్నాయి. ఏపీలో మాదక ద్రవ్య బానిసలు 600 శాతం పెరిగిందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఎ. నారాయణ స్వామి చెప్పారు. పార్లమెంటు వేదికగా జగన్ రెడ్డి రాష్ట్రం పరువు తీశారు..

ఏపీలో జగన్ రెడ్డి పాలనలో గంజాయి, డ్రగ్స్ మాఫియా ఎంత విచ్చలవిడిగా చెలరేగిపోతుందనేనదానిక ఇదే నిదర్శనం. వైసీపీ పాలనలో దేశంలో ఏమూలన ఏ అక్రమ వ్యాపారం బయటపడినా.. అందులో వైసీపీ మూలాలుంటున్నాయి. గతంలో గుజరాత్ ముంద్రా పోర్టులో ఆఫ్ఘనిస్తాన్‌ నుండి ఇరాన్‌ ద్వారా బెజవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ పేరుతో రవాణా చేస్తున్న 72 వేల కోట్ల హెరాయిన్ పట్టుబడింది.

ఈ కంపెనీ పేరుతో ఇప్పటికే 2 లక్షల విలువైన హెరాయిన్ దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిందని డీ.ఆర్. ఐ స్పష్టం చేసింది.ఒకప్పుడు ముంబయి, ఢిల్లీ వంటి మహానగరాలకే పరిమితమైన డ్రగ్స్ జాడ్యం జగన్ రెడ్డి పాలనలో ఏపీకి విస్తరించింది. వేలకోట్ల మాదక ద్రవ్యాల దందాకు రాష్ట్రం అడ్డాగా మారింది. వేల కోట్ల మాదక ద్రవ్యాలు బయటపడుతున్నా, వందల కోట్ల కుంభకోణాలు వెలుగు చూస్తున్నా.. ఎటువంటి విచారణ జరగకుండానే.. క్లీన్ చిట్ ఇస్తూ పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు.ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు డబ్బు కోసం నేరాలు, ఘోరాలు, మద్యం మాఫియా ఆగడాలు, డ్రగ్స్ దందాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మాదక ద్రవ్యాల మత్తులోకి దించుతూ యువత జీవితాలను నాశనం చేస్తున్నారు.మా నియోజకవర్గంలో కూడ గంజాయి తాగిన వ్యక్తులు, సాయి రెడ్డి అనే వ్యక్తి కూడా ఎస్సై మీద విచక్షణారహితంగా దాడులు చేశారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ముఖ్యమంత్రికి ఉంది…

రాష్ట్రంలో గంజాయి అనే పదమే వినిపించకుండా చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకుంటే..జగన్ రెడ్డి అండ్ కో నేడు రాష్ట్రాన్ని గంజాయి సరఫరాకు ప్రధాన కేంద్రంగా చేస్తున్నారు. విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీల్లో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు సరిహద్దు రాష్ట్రాలు ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న దందాను ఎండగడుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ సాగు చేసి ఉపాధిని కల్పించారు.

నేడు ఈ ప్రాంతంలో 25వేల ఎకరాల్లో విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో వైసీపీ నాయకులు గంజాయిని సాగుచేస్తున్నారు. యువతకు ఉద్యోగాలు సృష్టించకుండా.. గంజాయి సాగు, అక్రమ రవాణలోకి దించుతున్నారు. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు, కేరళ సహా పలు ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయి ఏపీ నుండే ఎగుమతి అయినట్లు పోలీసులు గుర్తించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా లిక్విడ్ గంజాయి రాష్ట్రం నుండి దేశంలోని ప్రధాన నగరాలకు సరఫరా చేస్తూ గంజాయి మత్తులో ముంచుతున్నారు. 3 దశళ్లో మద్యపానం నిషేదం అన్నారు..3 ఏళ్లు కావొస్తున్నా.. ఆదిశగా చర్యలు తీసుకోకపోగా మద్యం రేట్లు పెంచి నకిలీ బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ‎

టీడీపీ హయాంలో రూ.60 ఉన్న క్వార్టర్ చీప్ లిక్కర్.. నేడు రూ.180కి చేరింది. అది కూడా నాశిరకమైన, స్పిరిట్ అధిక శాతం కలిగిన బ్రాండ్లను విక్రయిస్తూ జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని, వినిపించని, ఆఫ్రికా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో.. గుర్రాలకు కూడా పట్టని మద్యం ఏపీలో అమ్ముతున్నారు.

వైసీపీ నేతల కనుసన్నల్లోనే అక్రమ మద్యం రవాణా, నాటు సారా తయారవుతోంది. వచ్చే 15 సంవత్సరాల మద్యం ఆదాయం తాకట్టు పెట్టి.. రూ.25వేల కోట్ల అప్పు తీసుకురావడమంటే ప్రభుత్వానికి మద్యనిషేదంపై చిత్తశుద్ది ఉన్నట్టా, లేనట్టా జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి..
ఆడపడుచుల పుస్తెలు తాకట్టు పెట్టి భర్తలు తాగితే.. వాళ్లను తాగుబోతు అంటాం. తాగుబోతుల్నే తాకట్టు పెట్టిన జగన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలకు ఏం పేరుపెట్టాలో అర్థంకావడం లేదు.భావితరాల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా డ్రగ్స్, మద్యం, ఇతర మత్తు పదార్థాలను నిషేధించాలని కోరుతున్నా.