జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఏపీ ఆరోగ్య రంగం అనారోగ్యం పాలైంది

Spread the love

– కరోనాతో దాదాపు లక్షన్నరమంది చనిపోయినాకూడా ముఖ్యమంత్రిలో చలనంలేదు
– కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.3వేలకోట్ల కరోనా నిధులను జగన్మోహన్ రెడ్డి దిగమింగాడు
– మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకవచ్చాక రాష్ట్రం అనారోగ్యానికి గురైతే, ఆరోగ్యరంగం పూర్తిగా అధ్వాన్నంగా తయారైందని, నీతిఅయోగ్ నివేదికే అందుకు నిదర్శనమని, కానీ సాక్షిపత్రిక అసలువాస్తవాలను వక్రీకరించి, ప్రజారోగ్యాన్ని అపహాస్యంచేసేలా తప్పుడురాతలు రాస్తోంద ని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే .. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల గోడలనుఅడిగితే, తుగ్లక్ రెడ్డి పాలన ఎలాఉందో, ప్రజలఆరోగ్యం ముసుగులో జరిగే అవినీతి ఏస్థాయిలో స్పష్టంగా చెబుతాయి. వైద్యఆరోగ్య రంగంలో విప్లవం తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి వాగ్ధానం, పచ్చి బూటకమని కేంద్రప్రభు త్వ సంస్థ అయిన నీతిఅయోగ్ ఆరోగ్యసూచీతో బట్టబయలైంది. రాష్ట్ర వైద్యరంగాన్ని జగన్మో హన్ రెడ్డి ఏవిధంగా భ్రష్టుపట్టించారో, ఎంతటిప్రమాదకర స్థాయికి దిగజార్చారో సదరునివేదిక తేటతెల్లం చేస్తోంది.

ప్రజారోగ్యంతోపాటు, వారికి అందించే వైద్యసేవల విషయంలో ముఖ్యమం త్రి వ్యవహరించిన అసమర్థ తీరుతో కరోనాసమయంలో లక్షలాదిప్రాణాలు పోయాయి. ఆరోగ్య రంగంలో దేశంలో ఇది వరకు రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు నాలుగోస్థానానికి చేరింది. ఆరోగ్యరంగం పనితీరులో, వైద్యసౌకర్యాల

కల్పనలో దేశంలోనే పదోస్థానానికి దిగజారింది. రాష్ట్రం అంతలా ఆరోగ్యరంగంలో దిగజారిపోవడానికి తుగ్లక్ రెడ్డి విధానాలే కారణం. ఏదేశమై నా, రాష్ట్రమైనా అభివృద్ధిసాధించాలంటే ఆరోగ్యరంగం బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రతిరూపమైన సాక్షిపత్రిక అసలువాస్తవాలను దాచేసి, అవాస్తవాలను ప్రజలముందుంచి వారిని మోసగించాలని చూస్తోంది.

నాడు-నేడు పథకం కింద ఆసుపత్రులను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని, అన్నిరకాల సౌకర్యాలను కల్పించామని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నాడు. నాడు-నేడు కింద ముఖ్యమంత్రి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తుం టే, ఆరోగ్యరంగం పనితీరులో ఏపీ దేశంలోనే ఎందుకు దిగజారిందో ఆయనే సమాధానంచెప్పా లి. విద్యారంగంలో నాడు-నేడు, వైద్యరంగంలో నాడు-నేడు అమలుచేశామని జబ్బలు చరు చుకుంటున్న ప్రభుత్వం, పేదలకు, ఉత్తమమైన వైద్యసేవలు అందిచండంలో ఎందుకు అన్నిరాష్ట్రాలకంటే అథమస్థాయికి దిగజారిందని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం.

ముఖ్యమం త్రి చేతగానితనం, అవినీతి, అసమర్థతతో కరోనాసమయంలో లక్షలాదిప్రాణాలు పోతే, ఆ మృతదేహాల చలిమంటల్లో ముఖ్యమంత్రి చలికాచుకున్నది నిజం కాదా? సాక్షి పత్రికలో నీతి అయోగ్ రిపోర్ట్ ను వక్రీకరించి తప్పుడురాతలు రాస్తే, పాలకులు వైఫల్యాలు కనిపించకుండా పోతాయా? తనశాఖకు అనారోగ్యం వస్తే ఆరోగ్యశాఖా మంత్రి ఎక్కడున్నాడు…ఏంచేస్తున్నా డు? కరోనా తొలి, రెండోదశలో ముఖ్యమంత్రి, ప్రభుత్వయంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా లక్ష లాదిప్రాణాలు పోయాయి. ఆఖరికి కరోనాతోచనిపోతే, దానికి సంబంధించిన మరణ ధృవీకర ణ పత్రాలు కూడా ఈప్రభుత్వం ఇవ్వలేదు. కరోనాతో రమారమీగా రాష్ట్రంలో లక్షా50వేల మంది వరకుచనిపోతే, వారి ఖననపు మంటల్లో ముఖ్యమంత్రి చలికాచుకున్నాడు.

సుప్రీం కోర్టు ఉత్తర్వులతో కేంద్రం కోవిడ్ తోచనిపోయిన వారికి రూ.50వేల పరిహారం ఇవ్వడానికి ముందుకొస్తే, అనేకకుటుంబాలు తమవారితోపాటు, కేంద్రమిచ్చే పరిహారాన్నికూడా కోల్పో యేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది నిజంకాదా? కరోనా నివారణ, కరోనాతో మృతిచెందినవారి కుటుంబాలను ఆదుకోవడానికి జాతీయవిపత్తుల నిధికింద కేంద్ర ప్రభుత్వమిచ్చిన రూ.3వేలకోట్లను జగన్ ప్రభుత్వం దారిమళ్లించింది వాస్తవంకాదా? కరోనా కిట్లు సరఫరాచేసే కాంట్రాక్టర్లకు జగన్మోహన్ రెడ్డి రూ.300కోట్లు బకాయిపెట్టలేదా? దాంతో సదరు సంస్థలు కరోనా కిట్ల సరఫరాను ఆపింది నిజంకాదా?

ఏపీ టీడీసీద్వారా కోవిడ్ బాధితులకు ఆహారం అందిస్తే వారికి ఇవ్వాల్సిన రూ.30కోట్లను కూడా ప్రభుత్వం ఎగ్గొట్టింది. గతప్రభుత్వంలో అయినదానికీ కానిదానీకి గొంతుచించుకున్న రిటైరైన అయ్యాఎస్ లు, మేథావులని చెప్పుకునే మేతావులు, ఇప్పుడున్న ఐఏఎస్ లు, బ్యూరోక్రాట్లు రాష్ట్ర ఆరోగ్యరంగం అనారోగ్యానికి గురైతే ఎందుకు స్పందించడంలేదు? మేథావుల మౌనం రాష్ట్రాని కి భవిష్యత్ అనేది లేకుండా చేస్తున్నాకూడా వారుస్పందించరా? రాష్ట్రంకానీ రాష్ట్రాల్లోకూర్చొ ని వారంతా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నా.

2019-20 నీతి అయోగ్ సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పారాసెట్మాల్ మాత్రలు కూడా దొరకడంలేదని తేలిపోయింది. వైద్యసిబ్బంది నియామకం మొదలు, ఆసుపత్రుల్లో మందులు, పరికరాలకు తీవ్రమైన కొరత ఉందని నీతిఅయోగ్ నివేదిక చెబుతోంది. ప్రసూతి మరణాలు ఆందోళనకరస్థాయిలో ఉంటే, 5ఏళ్లలోపు చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారని స్పష్టమైంది. ఆఖరికి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో దూదీ, సిరంజులు కూడా దొరకడంలేదని కేంద్రం నివేదిక తేటతెల్లంచేస్తోంది. ప్రసవంకోసం ప్రభుత్వఆసుపత్రులకు వచ్చేవారికిఇచ్చే ప్రాథమికఆర్థిక సహాయాన్నికూడా జగన్ ప్రభుత్వం రెండేళ్లనుంచి నిలిపేసింది.

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల అభివృద్ధికోసం బడ్జెట్లో రూ.2వేలకోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.23కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. మరోపక్క ముఖ్యమంత్రేమో శాఖలపై సమీక్షల పేరుతో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎన్నిసమీక్షలు చేసి, ఎంతప్రగతిసాధించాడో సమాధానంచెప్పాలి. మండలానికి రెండు పీహెచ్ సీలని, ఒక్కో పీహెచ్ సీలో ఇద్దరు డాక్టర్లని, పీహెచ్ సీలు 24గంటలు తెరిచే ఉంటాయని ముఖ్యమంత్రి డబ్బాలు కొట్టాడు. ఆయన చెప్పినవి ఎక్కడైనా సరే అమలవుతున్నాయా?

పాదయాత్రలో, ఎన్నికలకు ముందు వైద్యఆరోగ్యశాఖలో పనిచేసే ప్రతిఒక్కరినీ రెగ్యులరైజ్ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి, ఇంతవరకు ఎందుకు తనహామీని నిలబెట్టుకోలేకపోయాడు? పట్టణఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 2వేలమందిని ఈముఖ్యమంత్రి నిర్దాక్షిణ్యంగా తొలగించాడు. మొత్తంగా వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేసే దాదాపు లక్షమంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ముఖ్యమంత్రి తొలగించాడు.

ఆరోగ్యకేంద్రాలనుపెంచే క్రమంలో అప్పటికే 20ఏళ్లనుంచి పనిచేస్తున్నవారిని కాదని, వారిస్థానంలో కొత్తవారిని నియమించాలని చూడటం ఈప్రభుత్వఅరాచకం కాదా?తనస్వార్థంతో ఆర్థికశాఖను అప్పులశాఖగా మార్చిన జగన్మోహన్ రెడ్డి, ఆరోగ్యశాఖను కూడా అప్పులశాఖగా మార్చాడు.

వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అనేకమందికి ఈప్రభుత్వం జీతాలు చెల్లించకుండా వారిని అప్పులపాలు చేశాడు. టీడీపీప్రభుత్వంలో పేదలఆరోగ్యం కోసం అమలుచేసిన తల్లీబిడ్డా ఎక్స్ ప్రెస్ వాహనసేవలు సహా, ఎన్టీఆర్ బేబీకిట్ల పంపిణీ, ఏజెన్సీ ప్రాంతవాసులకు వైద్యసేవలకోసం తీసుకొచ్చిన ఫీడర్ అంబులెన్స్ సేవలను జగన్మోహన్ రెడ్డి నిలిపివేసంది నిజంకాదా? అందరికీ ఆరోగ్యాన్ని అందించాల్సిన ఆరోగ్యశ్రీని ఈ ముఖ్యమంత్రి కేవలం ఆర్భాటపుశ్రీగా మార్చేశాడు. రాష్ట్రంలో 16మెడికల్ కాలేజీలు, 16 ఆరోగ్య హబ్ లు ఏర్పాటుచేస్తున్నామని రెండున్నరేళ్లనుంచి చెబుతున్న జగన్మోహన్ రెడ్డి వాటినిర్మాణ పనులను ఎంతవరకు పూర్తిచేశాడో సమాధానంచెప్పాలి.

ఆఖరికి ఈ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆరోగ్యవిశ్వవిద్యాలయం కింద ఉన్న రూ.400కోట్ల నిధులను కాజేయడానికి సిద్ధమయ్యాడు. పేదల ఆరోగ్యానికి వెచ్చించాల్సిన నిధులతోపాటు, దేవాలయాల్లోని హుండీలసొమ్ముని కూడా దిగమింగే దుస్థితికి జగన్ ప్రభుత్వం దిగజారడం సిగ్గుచేటు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోని నిధులనుకూడా స్వాహాచేశారు. శ్రీకాకుళం ప్రాంతంలోని ఉద్దానంలో కిడ్నీ బాధితులకోసం ప్రత్యేకంగా వైద్యశాలనిర్మించడంకోసం గతప్రభుత్వం నిధులు కేటాయిస్తే, ఈ ముఖ్యమంత్రి వచ్చాక అక్కడ రూపాయి పనిజరగలేదు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంత మంది కిడ్నీ బాధితులు చనిపోతే ముఖ్యమంత్రిలో చలనం వస్తుందనిప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలోని పేదలు వైద్యసేవలు అందక అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చోద్యంచూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేతగాని, అసమర్థ విధానాలతో ప్రజలు మృత్యువాతపడుతున్నాకూడా మేథావులమని చెప్పుకునే మేతావులు స్పందించరా?

Leave a Reply