Suryaa.co.in

Andhra Pradesh

అప్పుతెచ్చుకొని తిందాము అన్నట్లుగా ముఖ్యమంత్రి, మంత్రుల వైఖరి

– సాగునీటి శాఖకు చెందిన 8వేలఎకరాల భూమిని సొమ్ముచేసుకోవాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నాడు
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు

సోమరులు, అసమర్థులు, నేరగాళ్లు ఒకచోట సమావేశమై తిందాం…తిందాం.. ఎక్కడ తెచ్చుకొని తిందాం.. అప్పుతెచ్చుకొని తిని ఎగ్గొట్టిపోదామన్నట్లుగా పాలకులవైఖరి ఉందని టీడీపీ అధికారప్రతినిధి పిల్లిమాణిక్యరావు ఎద్దేవాచేశారు. రాష్ట్రానికి భవిష్యత్, ప్రజలకు మంచి రోజులు అనేవిలేకుండా, దొరికినదాన్ని దొరికినట్లు అమ్ముకొని, అయినకాడికి పోగేసుకోవాలన్న దురుద్దేశం, దుగ్ధతోనే జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

మంగళవారం ఆయనమంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే … విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో ఉన్న సాగునీటిశాఖకు సంబంధించిన దాదాపు 8వేలఎకరాల భూమిని ఏవిధంగా అమ్మేసి, సొమ్ముచేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ప్రజల భవిష్యత్ ను, వారి అవసరాలను దృష్టిలోపెట్టుకొని కేటాయించిన భూములపై, ఇప్పుడు జగన్మో హన్ రెడ్డి కన్నేశాడు.

పోలవరంలో మట్టిని అమ్ముకొని వేలకోట్లు పోగేసుకున్న ముఖ్యమం త్రి, వైసీపీనేతలు ఇప్పుడు అదేవిధంగా ఇరిగేషన్ శాఖకుచెందిన 8వేలఎకరాల్లో మట్టిని తవ్వి, వాటిని చేపలచెరువులుగా మార్చి, తరువాత పూర్తిగా కబళించాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న పథకాలన్నీ చాలా విచిత్రంగా

ఉంటాయి. పైకి బిల్డ్ ఏపీఅంటూ రాష్ట్రాన్ని కూలగొడుతున్నాడు. నవరత్నాలపేరుతో ప్రజలను నవవిధాలుగా దోచుకుంటు న్నాడు. ఓటీఎస్ పథకం కింద పేదలఇళ్లను శాశ్వతంగా ఉంచుతామంటున్న ముఖ్యమంత్రి, మరోపక్కన పేదలు వారిఅవసరాలకోసం ఇళ్లను తాకట్టుపెట్టుకోవచ్చు అంటున్నాడు.

ఇవన్నీ ప్రజలకు అర్థంకావని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గుంటూరుసహా, రాష్ట్రంలోని అనేకప్రాంతాల్లో ఉన్న విలువైన ప్రభుత్వఆస్తు లను అమ్మేశాడు.గుంటూరులో మార్కెట్ ఏర్పాటుకోసం ఒకదాత ఇచ్చిన భూమిసహా, శ్రీ నగర్ లోఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి స్థలంతోపాటు, నల్లపాడులోఉన్న 6ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మాలని ప్రయత్నించాడు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విశాఖపట్నంలో ఉన్న వేలకోట్ల విలువైన వందల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. విశాఖనగరంలోని భూములన్నీ తాకట్టుపెట్టి, వందలకోట్ల రుణం పొందాడు. నగరంలోని ప్రభుత్వ సర్క్యూట్ హౌస్ సహా, తహసీల్దార్ కార్యాలయాన్ని, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, రైతుబజార్, పోలీస్ క్వార్టర్ భవనాలను ముఖ్యమంత్రి అమ్ముకున్నా డు. ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ విలువైన భూములు, వనరులుంటే వాటిని తెగ నమ్ముతున్న వ్యక్తే, పైకేమో బిల్డ్ ఏపీ జపంచేస్తుంటాడు.

కానీ వాస్తవంలో ముఖ్యమంత్రి చేస్తున్నది కిల్డ్ ఏపీ. ఓటీఎస్ పేరుతో ప్రజలకు మేలు జరుగుతుందని చెబుతున్న ముఖ్యమంత్రి, శాశ్వత గృహాలు , వాటిని అమ్ముకోవడానికి ఉన్న మార్గాలు అంటూ కొత్తపాఠాలు ఎందుకు చెబుతు న్నాడో ఆయనే సమాధానంచెప్పాలి. పేదలకు సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇళ్లు కట్టిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, దళితులకు చెందిన 6 వేల ఎకరాల భూములు లాక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏంచేసినా సరే, ప్రజలంతా అడుక్కు తినాలి అనే ఆలోచనలతో చేస్తున్నా డు. చంద్రబాబునాయుడు గారు ఆస్తులుకొనడం, పరిశ్రమలు వచ్చేలా చేయడం, యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం వంటివిచేస్తే, జగన్మోహన్ రెడ్డేమో కనిపించినదాన్నల్లా అమ్ముకుందాం.. అయినకాడికి పోగేసుకుందామనేలా వ్యవహరిస్తున్నాడు.

పేదలకోసం సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తున్నానంటున్న ముఖ్యమంత్రి, ఇసుకసహా, పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలను ఎందుకు తగ్గించడంలేదని ప్రశ్నిస్తున్నాం. కేవలం చిత్ర పరిశ్రమకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు,నిర్మాతలు, థియేటర్ల వారినుంచి కమీషన్లు రావడం లేదనే ముఖ్యమంత్రి సినిమా టిక్కెట్లపై పడ్డాడు. మంత్రి పేర్నినాని మాట్లాడుతూ, ప్రజల బాగు కోసం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తున్నట్లు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. సినిమా టిక్కెట్ల ధరలు పెరగడం వల్ల నిత్యావసరాలధరలు, కూరగాయల ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయంటూ మంత్రి వక్రభాష్యాలు చెబుతున్నారు.

చిత్రపరిశ్రమకు సంబంధించి ప్రశ్నించినవారిని ఎద్దేవాచేస్తూ, వాళ్లకేం తెలుసంటూ దెప్పిపొడుస్తున్న మంత్రి పేర్నినానీ కి వాస్తవాలు తెలియవని అర్థమైంది. గవర్నర్ తో సంబంధంలేకుండా కనగరాజ్ అనే మాజీ న్యాయమూర్తిని తమిళనాడు నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని, సదరు ప్రభుత్వ నిర్ణయాలను తమిళనాడులో, ముంబైలో ఉండే చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రశ్నించకూడదా?

హీరో సిద్ధార్థ్ తమిళనాడులో ఉంటాడు….ఆయనకు ఏపీలోని కష్టాలు ఎలా తెలుస్తాయంటున్న మంత్రిపేర్నినానీ తమిళనాడునుంచి మాజీన్యాయమూర్తులు కనగరాజ్, జస్టిస్ చంద్రులను ఏపీకి తీసుకొచ్చి, వారితో వైసీపీ ప్రభుత్వ పనితీరు బ్రహ్మండంగా ఉందని ఎందుకు మాట్లాడించారో సమాధానంచెప్పాలి. రాజ్యాంగ సంక్షోభం సృష్టంచడానికే జగన్ ప్రభుత్వం మాజీ న్యాయమూర్తులతో మాట్లాడించిందనే వాస్తవం ప్రజలకు తెలియదా?

రాష్ట్రాన్ని అప్పులపాలుచేసిన జగన్మోహన్ రెడ్డి, ఏపీలోఉన్నభూములను అమ్మాలనిచూస్తు న్నాడుతప్ప, తెలంగాణనుంచి ఏపీకి రావాల్సిన ఆస్తులు, బకాయిలను తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం చేయడంలేదు. అందుకే అంటున్నాం… ప్రభుత్వం, ప్రభుత్వంలోని వారు, ముఖ్యమంత్రి అందరూ కలిసి తిందాం.. తిందాము..ఎక్కడ తెచ్చుకొని తిందాము.. అప్పు తెచ్చుకొని తిందామనే సిద్ధాంతాన్నే నమ్ముకున్నారని.

LEAVE A RESPONSE