– సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు
అమరావతి : అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ ప్రైవేటు యూజర్ ఐడీ పెట్టుకొని అడిగిన వారికి వ్యూస్ ఇస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన హైకోర్టు తరపు న్యాయవాది.పంచ్ ప్రభాకర్ ప్రైవేట్ వ్యూస్ ని ఇస్తూ ఇంకా అగౌరవ పరుస్తున్నారని అఫిడవిట్. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో, పంచ్ ప్రభాకర్ గురించి ప్రస్తావించకపోవడంపై తీవ్ర అభ్యంతరం.
యూట్యూబ్ లో ప్రైవేటు వ్యూస్ కల్పించడంపై హైకోర్టు ఆగ్రహం. పంచ్ ప్రభాకర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని సీబీఐని నిలదీసిన హైకోర్టు. అమెరికాలో ఉండడంతో ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరామని చెప్పిన సీబీఐ.నూతన పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వ్యూస్ పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారని యూట్యూబ్ ను నిలదీసిన హైకోర్టు. ప్రభాకర్ అరెస్ట్ కు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మార్చి 21లోపు కోర్టుకి తెలపాలన్న ధర్మాసనం.ప్రైవేట్ వ్యూస్ నిషేధించడానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని యూట్యూబ్ కు ఏపీ హైకోర్టు ఆదేశం.