Suryaa.co.in

Andhra Pradesh

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ టాప్

ఎంపీ విజయసాయి రెడ్ది

ఏప్రిల్ 19: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగా పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, 2022-23 లో 7.65 లక్షల కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ లో నిలిచిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ప్రాజెక్టు టుడే, ఇతర ఆంగ్ల పత్రికలు ఈ విషయాన్ని వెల్లడించాయని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బుధవారం పలు అంశాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయని అన్నారు.

మూలపేట పోర్టుతో ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4362 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న మూలపేట పోర్టుకు బుధవారం భూమిపూజ చేయడంతో ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేశారని విజయసాయి రెడ్డి అన్నారు. పోర్టు భూమిపూజతో ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాల కల నెరవేరిందని అన్నారు. అలాగే సీఎం జగన్ 360 కోట్లతో నిర్మించనున్న మోడరన్ ఫిషింగ్ హార్బర్ కు శంకుస్థాపన చేయడంతో ఉత్తరాంధ్ర అభివృద్దితో దూసుకుపోనుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 7% మత్స్యకారులు ఉన్నారని, రాష్ట్రం నుంచి ఎగుమతుల్లో మత్స్యకారులు కీలకపాత్ర పోషిస్తున్నారని, సమాజానికి వారు పునాది వంటివారని కొనియాడారు.

వడగాలులపై అప్రమత్తంగా ఉండాలి
వడగాలులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలో, అలాగే దేశంలో పలు ప్రాంతాల్లో వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షలు రాస్తున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పాఠశాల పని సమయాల్లో మార్పు చేసిందని అన్నారు. వైద్యులు సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగ కంపెనీలు, మైన్స్ కంపెనీలలో పనిచేస్తున్న వర్కర్లపై వడగాలుల ప్రభావం చూపకుండా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వడగాలుల వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఈ మేరకు ప్రతి ఒక్కరూ డాక్టర్ల సలహాలు పాటించాలని ఆయన కోరారు.

LEAVE A RESPONSE