అలరించిన సప్త స్వరాలు

విశాఖపట్నం: విశాఖ ఫ్యామిలీ ఆధ్వర్యంలో సప్త స్వరాలు సీజన్ -2 నగరంలోని రెయిన్ బో వేదిక ఫంక్షన్ హాల్ లో ఆదివారం అత్యంత వైభవం గా జరిగాయి. తెలుగు రాష్ట్రాల తో వెస్ట్ బెంగాల్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని 200 మంది గాయని గాయకులు ఇందులో పాల్గొని మధుర గీతాలు, హుషారైన సినీ పాటలు పాడి రంజింప జేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముత్తం శెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిధి గా విచ్చేసి గాయకులకు జ్ఞాపికలు, సర్టిఫికేట్ లు ప్రదానం చేసి మాట్లాడారు. గాయనీ గాయకులకు ప్రభుత్వ పరంగా గుర్తింపు కార్డు లు, సంక్షేమ పథకాలు, ఇళ్ళ స్థలాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. తనకు కళాకారులన్నా, కళలు అన్నా ఎంతో ఇష్టమనీ అన్నారు. అనంతరం ఆయనను సింగెర్స్ అంతా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిసిపి మొహమ్మద్ ఖాన్, సంస్థ వ్యవస్థా పకులు డి. రామలక్ష్మి, ప్రసాద్, నిర్వాహకులు, సీనియర్ గాయకులు శ్రీరామ మూర్తి, డీ ఎల్ వి ప్రసాద్, యు.వి. రమణ, సునీల్ రాథోడ్, జీ.వి. రమణ, వాణి చంద్, గీతా లక్ష్మి, పాల్గొన్నారు.