మహిళలకేనా షరియా? మగవారికి వర్తించదా?

గిట్టుబాటయ్యే చట్టమే – మాకు చుట్టం

మనలో చాలామందికి… ముస్లింలో అత్యధిక శాతం తమ మతాచారాలను నిజాయతీగా నిక్కచ్చిగా పాటిస్తారనే అపోహ మరీ ఎక్కువగానే వుంది…
మంచివో చెడ్డవో వాళ్ళ మతాచారాలు వాళ్ళు పాటిస్తుంటే మనకెందుకు నొప్పి అనేవాళ్ళే అనేకులు…

అయితే…,
వాళ్ళు నిజంగానే వాళ్ళ మతాచారాలను ఎక్కడెక్కడ పాటిస్తున్నారో … ?
ఎక్కడెక్కడ దాటవేస్తున్నారో …?
దానివల్ల మనకు జరిగిన , జరుగుతున్న, జరుగబోయే ముప్పేమిటో …???
ఒక్కసారి విశ్లేషిద్దాం…

బహు భార్యత్వం ( Polygomy) :: ఒకేసారి నలుగురు భార్యల వరకు షరియా ప్రకారం అనుమతి.

త్రిబుల్ తలాక్
ఐదో భార్యను కూడా చేసుకోవాలంటే…,
పెద్దగా కష్టపడాల్సిందేమీలేదు…
జస్ట్ ఆ నలుగురిలో ఎవరో ఒకరికి ఒక మతపెద్ద సమక్షంలో తలాఖ్ తలాఖ్ తలాఖ్ అని చెప్తే సరిపోతుందట …
మగవాళ్ళకు ఇంకా సులభంగా వుంటుందని మొదట్లోలాగా నెల రోజుల Gap కూడా అవసరం లేకుండా వెంటవెంటనే త్రిబుల్ తలాక్ చెప్పొచ్చట …,
ఇంకా సులభంగా ఉండడానికి ఫోన్‌కాల్ లోనైనా, చివరికి వాట్సాప్ మెసేజ్ ద్వారానైనా చెప్పొచ్చంటూ వెసులుబాటు కల్పించారు లెండి …

హలాలా
త్రిబుల్ తలాక్ చెప్పిన తర్వాత ఒకవేళ మనసు మార్చుకొని మళ్ళీ అదే అమ్మాయితో కలిసి వుండడానికి గానీ… లేదా మళ్లీ నిఖా ( పెళ్ళి) చేసుకోవడానికి గానీ షరియా అస్సలు ఒప్పుకోదట…
అ అమ్మాయికి ఇంకెవరితోనో నిఖా జరిపించి… మళ్ళీ ఆ రెండవ భర్తతో త్రిబుల్ తలాక్ చెప్పించుకుంటేనే గానీ, మొదటి భర్త అ అమ్మాయిని నిఖా చేసుకోవడానికి వీలులేదట…

ఈ గొప్ప మతాచారాన్నే ముద్దుగా హలాలా అని పిలుస్తారట…

భరణం ::

ఇక త్రిబుల్ తలాక్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి మూడు నెలలకు సరిపడ డబ్బు , సరుకులు ఇచ్చి ఆ మహిళ బరువు బాధ్యతలు దించేసుకోవచ్చట ….
అట్లెట్ల నేనెట్ల బతుకాలంటూ …, 62yrs వయస్సులో ఐదుగురు పిల్లల షబానా అనే వృద్ధ మహిళ 1986 లో కోర్టెక్కుతే…, జిల్లా కోర్టు, హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు కూడా ఆమెకు Regular గా Maintenance ఇవ్వాల్సిందేనంటూ తీర్పు చెబితే ..,

మా మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కోర్టులకు ఏమి అధికారముంది … మా షరియా ఉండగా మీ రాజ్యాంగ చట్టాలు మాకెందుకు… అంటూ…., దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలతో యధేచ్చగా అల్లర్లు, ఆస్తుల విధ్వంసం, కొనసాగించడంతో భయపడిపోయిన, ఓట్ల కొరకు గడ్డితినే… నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ , పార్లమెంట్లో తనకు లభించిన మంద బలంతో , ఏకంగా రాజ్యాంగాన్నే సవరించి ఆ వృద్ధ బాధిత నిరాధార మహిళ షబానోకే గాకుండా…, అటువంటి కోట్లాది అనాథ అభాగ్య మహిళల నోట్లో మట్టిగొట్టాడు మన వీర సెక్యులర్ రాజీవుడు …

ఇక అసలు విషయానికొస్తే…
మరి, దొంగతనం చేస్తే అదే షరియా ప్రకారం చేతులు కొట్టేయ్యలని వుంది.
కానీ,
ఇప్పటివరకు దొంగతనం చేసిన మా ముస్లింలకు షరియా ప్రకారమే చేతులు నరకడం లేదెందుకు ? అని ఈ 70/80 yrs లో ఒక్కడైనా ధర్నాలు నిరసనలు చేసిన సందర్భం వుంటే చెప్పమనండి …

ఖురాన్ ను తూచ తప్పక పాటిస్తామని డబ్బా కొట్టుకునే ముల్లాలు, మౌల్వీలు, ఇమామ్ ల మతవిశ్వాసం ఎక్కడ పోయిందట…!?!?
Feviquick అంటించుకున్నట్లుగా గప్ చుప్ ఎందుకయ్యారట …వాళ్ళ మత విశ్వాసం ఎక్కడ పోయిందట..
అంతేకాదు…,
వడ్డీకి డబ్బులు ఇవ్వడమూ తీసుకోవడమూ కూడా ఇస్లాం ప్రకారం రెండూ నేరమే…
కానీ…,
ఇప్పటివరకూ బ్యాంకుల్లో గానీ, బయట గానీ వడ్డీ తీసుకున్న ముస్లింలపై Fatwa జారీచేసిన ముల్లా మౌల్వీలను ఎప్పుడైనా చూసారా ?
అంటే, మహిళలకు నరకప్రాయంగా మారిన Triple Talaq, Polygomy, HALALA,…. లాంటి విషయాల్లోనైతే వీళ్ళకు షరియా కావాలట …

మగవాళ్ళ విషయాల్లోనైతే కఠినమైన షరియా వద్దట … సులభమైన మన రాజ్యాంగ చట్టాలే ముద్దట …

Civil Cases లో నేమో షరియా కావాలట,
కఠినమైన Criminal Cases లోనేమో సులభమైన Punishments వుండే మన రాజ్యాంగం కావాలట …

ఇతర మతస్తులతో ఆర్థిక,ఆస్తుల తగాదాల్లోనూ వాళ్ళకేది Convenient గా వుంటే దాన్నే తీసుకొంటూ మనకు తీవ్ర నష్టం కలిగించిన సంఘటనలు కోకొల్లలు…

వక్ఫ్ బోర్డ్ ఆస్తుల చట్టం ప్రకారం…!!!
వాళ్ళు ఎవరి ఆస్తుల్నైనా Claim చేసారనుకోండి… ఇక దానిపై మనము ఆశలు వదులుకునే విధంగా గత Fake Secular ప్రభుత్వాలు వాళ్ళకు పూర్తిగా అనుకూలమైన చట్టాలు Already చేసేసాయనైనా తెల్సా మనకు..?
ఆ చట్టప్రకారం
Private ఆస్తులకే కాదు Govt. ఆస్తులకు కూడా రక్షణ లేదనే విషయమైనా మనలో కొందరికైనా తెల్సా ?!

దేవాలయాల ముందునుండి వాళ్ళు ఊరేగింపులు తీయడానికి ఇస్లాం ఒప్పుకుంటుందట
కానీ,
వాళ్ళ మసీదు ముందునుండి ఇతరుల ఊరేగింపు మాత్రం ఒప్పుకోదట ..
కాఫీర్ల అమ్మాయిలను పెండ్లి చేసుకోవడానికి ఇస్లాం బాగానే ఒప్పుకుంటుందట
కానీ…,
వాళ్ళ అమ్మాయిలను కాఫీర్లు చేసుకోవడానికి వీలులేదట…
ఎంతగొప్ప మత సామరస్యమో కదా?
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో…

అందుకే…!!!
అడుసు తొక్కనేల…?
కాళ్ళు కడుగనేల…?

తమ స్వార్థప్రయోజనాల కోసమే …,కేవలం హిందువులకే నీతులు చెబుతూ…, మతోన్మాదులకే మద్ధతిస్తున్న కుటుంబ,కుల, అవినీతి రాజకీయ నేతలకు కీలెరిగి వాతపెట్టండి .

– అచ్చినాయుడు
( ఈ వ్యాసంలోని అంశాలు రచయిత వ్యక్తిగతమైనవి మాత్రమే)

 

Leave a Reply