Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడ లో ఏ పి బి ఎస్ ఎస్ ఎస్ సమావేశం

విజయవాడ: నగరంలోని సత్యనారాయణపురం కౌతా వారి సత్రం లో ఆదివారం ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (ఏ పి బి ఎస్ ఎస్ ఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మడకశిర కు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు వీఎస్ గురుమూర్తి ,కోశాధికారిగా కౌతా సుబ్బారావు, అర్చక పురోహిత విభాగ అధ్యక్షునిగా కాణిపాక లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా మామిళ్ళపల్లి అయ్యప్పలను ఎన్నుకున్నారు.

బ్రాహ్మణ ద్వేషులు కదిరి కృష్ణ, పైలా దాస్ లు సంస్కృతి సంప్రదాయాలు కించపరిచే లా వ్యవహరించి బ్రాహ్మణ మహిళలను అప్రదిష్ట పాలు చేస్తున్న వారిరువురు పై క్రిమినల్ కేసు లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.
కూటమి గెలుపునకు కృషి చేసిన బ్రహ్మణలకు వారి స్థాయిని బట్టి నామినేటెడ్ పదవులు కేటాయించాలని.. తొలి తెలుగు ప్రధాని, అపర చాణుక్యుడు పి వి నరసింహారావు చిత్రపటాన్ని అమరావతి అసెంబ్లీ హాలు లో ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.

బ్రాహ్మణ భవన్ నిర్మాణం కోసం అమరావతిలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని, కార్పొరేషన్ పునరుద్ధరించి నిధులు కేటాయింపుతో పాటు కార్పొరేషన్ చైర్మన్ కు కేబినెట్ ర్యాంక్ కల్పించాలని,తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మడకశిర కు చెందిన బి ఎస్ గురుమూర్తి కి కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి కేటాయించాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో నాయకులు సి ఏ పి రానుజాచారి, రాంభద్రుడు,పీఠంపాటి కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE