Suryaa.co.in

Andhra Pradesh

కూటమి ప్రభుత్వంలో 203 సంస్థలకు ఏపీఐఐసీ భూ కేటాయింపులు శుభపరిణామం

– ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి అనిత
– బాధ్యతలను స్వీకరించిన మంతెన రామరాజు, దామచర్ల సత్యలను సత్కరించిన హోం మంత్రి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ జిల్లాల పారిశ్రామిక పార్కుల్లో 203 సంస్థలకు ఏపీఐఐసీ భూములను కేటాయించడం శుభపరిణామమని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. భూముల కేటాయింపులు జరిగిన పరిశ్రమల ద్వారా రూ.2,349.86 కోట్ల పెట్టుబడులు, 4,300 మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయని ఆమె స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మంతెన రాంబాబు (రామ)రాజును హోంమంత్రి అనిత అభినందించారు. మారిటైం బోర్డు కార్యాలయ సమీపంలోని రాయల్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఏపీఎంబీ ఛైర్మన్ దామచర్ల సత్యనారాయణ (సత్య) ప్రమాణస్వీకార కార్యక్రమానికి సైతం ఆమె హాజరయ్యారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏపీఐఐసీ, ఏపీ మారిటైం బోర్డు నూతన ఛైర్మన్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా హోం మంత్రి వారిని సత్కరించి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిశ్రమల ఏర్పాటు, పోర్టుల అభివృద్ధితో రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు అందించాలని హోం మంత్రి అనిత ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE