Suryaa.co.in

Andhra Pradesh

ఇండస్ట్రియల్ పార్కులో పేదలకు స్థలాలు కేటాయింపా?

– తప్పుడు కేసులతో నన్ను జైలుకు పంపడం ఎవరితరమూ కాదు..
– గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాజమహేంద్రవరం : జగన్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. టీడీపీ తెలుగురైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ నర్సరీ గెస్ట్ హౌస్ వద్ద జరిగిన కడియం మండల పార్టీ సమావేశానికి ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జగన్ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా మోసం చేసిందన్నారు. పధకాలు,లేవు ,పనులు లేవు, ఇసుక కొరత, ఇంటి పన్నుల పెంపు, చెత్త పన్ను, డీజిల్, పెట్రోల్ ధరల పెంపు ఇలా అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలుచేసారని, రాష్ట్రంలో ఒక్క రోడ్డు వేయలేదని అన్నా కాంటీన్లను మూసి వేసి పేదల కడుపు కొట్టారని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు.
ఇటీవల హెల్త్ టెస్టులకు తెలంగాణా వెళ్లానని ఆ రాష్ట్రం దేదీప్యమానంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వైసీపీ పార్టీ వైపల్యంతో మన రాష్ట్రానికి చెందిన పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని పేర్కొన్నారు.
బెదిరేదే లేదు.. నన్ను జైలుకు పంపడం ఎవరి తరం కాదు..
వేమగిరి కొండ సదునులో 60 కోట్ల దోపిడీని వెలుగులోకి తీసుకొస్తే తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడానికి వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.తనను జైలుకు పంపడం ఎవరితరం కాదని ఇక గ్రామాల్లో పర్యటించి వైసీపీ వైఫల్యాలను చాటుతానన్నారు.
తను ఎప్పుడూ అధికార దుర్వినియోగం చేయలేదని నీరు.. చెట్టు పధకంలో కాంట్రాక్టర్లు నుండి చాలనాలు చెల్లించి కొంత మట్టిని తీసుకువెళ్లానని నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో తన భూమిలో మెరక పనులు చేసుకొన్నానని లెక్కలన్నీ తన వద్ద ఉన్నాయని గోరంట్ల అన్నారు.
దళితులను దూషించానని తప్పుడు అభియోగాలు చేస్తున్నారని, తాను అందరినీ గౌరవిస్తానని గోరంట్ల అన్నారు. అక్రమ కేసులు బనాయిస్తే న్యాయస్థానాలున్నాయన్నారు.
ఎంపీ, పార్లమెంట్ నియోజకవర్గానికా? రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికా
రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రతినిధా లేక రూరల్ అసెంబ్లి నియోజకవర్గానికో అర్ధం కావడం లేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన తాను ఎమ్మెల్యే గా ఉన్నానని, వైసీపీ కో ఆర్డినేటర్ ను కూడా నియమించిందని ఇక ఎంపీ అతి జోక్యం చేసుకొంటే చూస్తూ ఊరుకునేది లేదని గోరంట్ల అన్నారు..

LEAVE A RESPONSE