– కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండడం సిగ్గుచేటు.
– ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్: గోదావరి నది పై ప్రాజెక్టులను ఎన్నడూ అడ్డుకోలేదని చెబుతున్న చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? గోదావరి పై అన్ని అనుమతులు సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకుంటూ కేంద్రానికి రాశారు. భక్త రామదాసు ప్రాజెక్ట్ పనులు ఆపాలని కేంద్రానికి లేఖ రాశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నారు. ఇప్పుడేమో మాట మార్చి నీతులు చెబుతున్నారు.
మళ్లొక్కసారి రెండుకండ్ల సిద్ధాంతంతో ..తెలంగాణకు ద్రోహం చేసే కుట్రలకు తెర లేపిండు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని మాట్లాడుతున్నారు. గోదావరిలో మిగులు జలాలనే తీసుకుంటామని అబద్ధాలు చెబుతున్నారు.
అసలు బనకచర్లకు అనుమతులే లేవు. అలాంటి ప్రాజెక్టును అక్రమంగా కట్టుకుంటూ చంద్రబాబు నయవంచనపు మాటలు మాట్లాడటం తెలంగాణకు అన్యాయం చేయడమే. తెలంగాణ నది జలాలు చంద్రబాబు తరలించుకు వెళ్తుంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండడం సిగ్గుచేటు.