Suryaa.co.in

Andhra Pradesh

ఆఫ్ఘన్ లో ఉన్నామా.? ఆంధ్రాలోనా?

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
జగన్ పాలనలో శాంతి భద్రతలు కరువు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడికి ప్రయత్నించడం వైసీపీ గుండాల బరితెగింపు చర్యలకు నిదర్శనం. ఒక్కరోజైనా వైసీపీ నేతల భాషపై, వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పశ్చాత్తాపం వ్యక్తం చేశారా.? గత రెండున్నరేళ్లుగా అధికార పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేలు, చివరికి స్పీకర్ మాట్లాడిన భాషతో పోలిస్తే అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలు 1% కూడా లేవు. జగన్ క్యాబినెట్లో సగం మంది బూతుల మంత్రులే ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటి పైకే రాళ్లు, కర్రలతో దాడి చేసేందుకు యత్నించారంటే..మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు,మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు నిత్యం తిరిగే ప్రాంతంలోనే ఇంతటి కిరాతక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది.? వైసీపీ గుండాలు నిన్నటి నుండే.. దాడి చేస్తాం,తాట తీస్తాం అంటూ హెచ్చరిస్తుంటే పోలీసులు ఎందుకు స్పందించలేదు.? దేవాలయాలకూ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. కర్రలు, రాడ్లు, రాళ్లతో వెళ్తున్నవారిని ఎందుకు వదిలేశారు.? చంద్రబాబు నాయుడి ఇంటి వద్ద జరిగిన ఘటనను వైసీపీ ప్లాన్ చేస్తే.. పోలీసులు దగ్గరుండి అమలు చేయిస్తున్నట్లుంది. జడ్ + కేటగిరి భద్రత ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే వైసీపీ గుండాలు దాడులకు పాల్పడ్డారు అంటే.. ఇంకా సామాన్య మానవునికి ఈ రాష్ట్రంలో భద్రత ఏది?

LEAVE A RESPONSE