Suryaa.co.in

Andhra Pradesh

వావిలాల గోపాలకృష్ణయ్య గారి జీవితం ఆదర్శనీయం

-వావిలాల గారి 116 వ జయంతి వేడుకల్లో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
నాలుగు సార్లు ఎమ్మెల్యే గా చేసినప్పటికీ నిరాడంబరమైన విధానాలతో వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన ప్రజాసేవ స్ఫూర్తిదాయకం అని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులుగా, ఆంధ్ర గాంధీగా ఆయన కీర్తి గడించారని అన్నారు. సత్తెనపల్లి లోని వావిలాల ఘాట్ లో వారి విగ్రహానికి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు , పలువురు నేతలు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన మార్గాలు నేటి నాయకులకు అనుసరణీయం అని పేర్కొన్నారు. ఎంతో సదా సీదాగా తన తండ్రి లావు రత్తయ్య గారి వద్దకు విద్యార్థుల చదువుల గురించి గోపాల కృష్ణయ్య వచ్చేవారిని ఎంపీ గారు తన చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సాధనకు ఆయన కృషి చేసినట్లు చెప్పారు. ఆయన ఖ్యాతిని మరింత వ్యాపింప చేసేలా వారి జయంతి, వర్థంతి వేడుకలు మరింత ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ వేడుకలలో విద్యార్థులను, ఉపాధ్యాయులను ఎక్కువగా పాల్గొనేలా కార్యాచరణ చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు , mlc డొక్కా మాణిక్య వరప్రసాద్ , పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE