మాచర్ల మారణహోమానికి పిన్నెల్లి తగిన మూల్యం చెల్లించుకుంటాడు

Spread the love

-ప్రభుత్వం ఉందన్న అహంకారంతో పేట్రేగిపోతున్న
-ప్రతి వైసీపీ కార్యకర్తకు, సైకిల్ ప్రభుత్వం రాగానే సరిగమలు పలికిస్తాం

-టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

పల్నాడు ప్రజల్ని భయకంపితుల్ని చేస్తూ, అధికారమదంతో పిన్నెల్లి సాగిస్తున్న మారణ హోమానికి భవిష్యత్ లో అతనుపదింతల మూల్యం చెల్లించుకోవడం ఖాయం. సైకిల్ ప్రభుత్వం వచ్చాక పిన్నెల్లి సహా, ప్రతివైసీపీ కార్యకర్తకు సరిగమలు పలికిస్తాం. పిన్నెల్లి ఎమ్మెల్యే అయ్యాక పౌరుషాల పురిటిగడ్డ మాచర్ల అవినీతికి అడ్డాగా మారింది.

రామకృష్ణారెడ్డి రంకెలేస్తే భయపడటానికి మాచర్లలో ఉంది జైలుపక్షికాదు.. జూలకంటి. టీడీపీకార్యకర్తలపై దాడిచేసి, పోలీసుల్ని అడ్డుపెట్టుకొని వారిఆస్తులుధ్వంసంచేయడం మగతనంకాదు పిన్నెల్లి. దమ్ముంటే, మగతనముంటే బహిరంగంగా రా… తేల్చుకుందాం. ఇదేంఖర్మ- రాష్ట్రానికి కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా జూలకంటి బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పడుతున్నప్రజలు, పిన్నెల్లిపై కాండ్రించి ఉమ్మేస్తున్నారు. ప్రజల ఛీత్కారాలు, శాపనార్థాలు జీర్ణించుకోలేకనే జగన్ బినామీ పిన్నెల్లి, వైసీపీమూకల్ని రెచ్చగొట్టి, మాచర్లను మంటల్లోకి నెట్టాడు.

Leave a Reply