మీరు పోలీసులా.. ఉన్మాదులా?

-ఎంపీని కొట్టి చంపేస్తాం అని పోలీసులే బెదిరించారు
-సీబీఐ పైనే కేసులు పెట్టిన ప్రభుత్వం ఇది
-ఒక ఎంపి రాష్ట్రానికి రాలేని పరస్థితిని కల్పించారు
-ఈ రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు లేవా?
-తప్పుడు కేసులు పెట్టిన వారిని కట్టడి చెయ్యాలి
-అధికారంలోకి వచ్చిన తరువాత అడ్వకేట్లకు మంచి అవకాశాలు
-తెలుగు దేశం పార్టీ లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
-పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో పోలీసులు మానవత్వం లేకుండా ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. లీగల్‌సెల్‌ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన ఆయన.. వైసీపీ అరాచకాలు ఎదుర్కొనేందుకు లీగల్‌సెల్‌ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తప్పుడు కేసులుపెట్టే అధికారులపై, ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు వేయాలని, పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే..

లీగల్ సెల్ విభాగం చాలా కీలకమైన విభాగం. స్వాతంత్ర్య ఉద్యమంలో సైతం న్యాయవాదులు కీలకంగా ఉన్నారు. జాతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ టిడిపి.దేశంలో ఎన్నో చరిత్రలు సృష్టించిన పార్టీ తెలుగు దేశం పార్టీ. పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగు దేశం.దేశంలో అనేక కీలక సంస్కరణల్లో టిడిపి భాగస్వామిగా ఉంది. దేశం లో శాసన, కార్యనిర్వాహక, మీడియా, న్యాయ వ్యవస్థలు కీలకం.ఏ వ్యవస్థ తప్పు చేసినా సరిదిద్దే అధికారం న్యాయవ్యవస్థకు ఇచ్చారు. మీడియా కు కూడా రాజ్యాంగ రక్షణ కల్పించింది.నా 40 ఏళ్లలో ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలతో ఈ 40 ఏళ్లలో పోరాడాము.

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావంలో 47 మంది అడ్వకేట్ల కు టిక్కెట్లు. 20 మంది డాక్టర్లు, 8 మంది ఇంజనీర్లు, 125 మంది గ్రాడ్యుయేట్ల కు టిక్కెట్లు ఇచ్చాం. విద్యావంతులను రాజకీయాల్లో ప్రోత్సహించాం. లీగల్ సెల్ కు పనిచేసిన కనకమేడల ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. పార్టీలో అన్నింటి కంటే ముఖ్యమైన అనుబంధం సంస్థ లీగల్ వింగ్. రాష్ట్రంలో పోలీసులు ఇలా అయిపోతారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ముఠా కక్షలు, రౌడీలను అణిచివేసింది ఈ పోలీసు వ్యవస్థే.అయితే ఇప్పుడు కొందరు పోలీసు అధికారులు పూర్తిగా గాడి తప్పారు. నాడు మంచి అధికారులకు మంచి పోస్టులు ఇచ్చి ప్రోత్సహించాము. ఇప్పుడు అవినీతి అధికారులకు కీలక పోస్టులు ఇస్తున్నారు. కరుడుగట్టిన నేరస్థునికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంది. వివేకా హత్య కేసులో నిందితులు చనిపోతున్నారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నాడు.వివేకా హత్య కేసు ను దర్యాప్తు చేస్తున్న సీబీఐ పైనే కేసులు పెట్టిన ప్రభుత్వం ఇది.సిబిఐకే దిక్కులేకపోతే…డ్రైవర్ గా ఉండే నా పరిస్థితి ఏంటని దస్తగిరి అడుగుతున్నాడు.ఈ రాష్ట్రంలోని ప్రజలు అంతా ఈ పరిస్థితులు గురించి ఆలోచించాలి.

వివేకాను చంపి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ప్రభుత్వం వచ్చిన తరువాత కేసును పక్కన పెట్టేశారు.ఆలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో చూడండి. ఒక పార్లమెంట్ సభ్యుడిని కస్టడీలో హింసించిన ఘటన దేశంలో ఎప్పుడూ జరగలేదు. మన దగ్గర ఎంపిని కొట్టి చంపేస్తాం అని పోలీసులే బెదిరించారు. అతను టీడీపీ ఎంపి కాకపోయినా…మేం న్యాయం కోసం అండగా నిలబడ్డాం. ఒక ఎంపి రాష్ట్రానికి రాలేని పరస్థితిని కల్పించారు. ట్రైన్ లో వస్తే అతన్ని అందులోనే అంతమొందించే ప్రయత్నం చేశారు. ఇలాంటి అరాచక పాలన అందిస్తున్న నేరస్థులను కట్టడి చెయ్యాలి. దానికి అడ్వకేట్ల సహాయం కావాలి. జర్నలిస్ట్ అంకబాబు నా బంధువు కాదు…మన పార్టీ కాదు…కానీ అక్రమ కేసుపై అడ్వకేట్లను పంపాను. రక్షణగా నిలిచాముబంగారం అక్రమ రవాణాపై వార్తను ఫార్వర్డ్ చేస్తే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే వారికి కోపం వచ్చింది. అక్రమ కేసు పెట్టి అరెస్టులు చేస్తున్నారు.
ఈ రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు లేవా…టిడిపి మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారు.నరేంద్రను పోలీసు కస్టడీలో హింసిచే అవకాశం ఉందని ముందే అందరికీ లేఖలు రాశాము.అయినా నరేంద్రను హింసించారు. మీరు పోలీసులా ఉన్మాదులా? ఈ రోజు ఉంది….రేపు ఉంది…ఎల్లుండి కూడా ఉంటుంది. కొట్టిన వారి పేర్లు కూడా ఉన్నాయి.చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు శిక్ష తప్పదు.

నా తరువాత వచ్చిన ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్దిని అడ్డుకుని ఉంటే ఇప్పుడు ఏమయ్యేద హైటెక్ సిటీ ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్ వంటి అభివృద్ది పనులు తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి కబట్టే నేడు మంచి ఫలితాలు. అమరావతికి సాక్షాత్తూ ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ నాడు అమరావతికి అంగీకారం తెలిపారు. నాడు రాజధానికి అన్నివిధాలా జగన్ అంగీకరించారు.
కొత్త సీఎం వచ్చిన ప్రతి సారీ రాజధాని మారుస్తాను అంటే కుదురుతుందా.రాజధాని నిర్ణయించే అధికారం పార్లమెంట్ కు ఉంది. హైకోర్టు సైతం ఇదే విషయం స్పష్టంగా చెప్పింది. మూడు రాజధానులు అంటూ ప్రాంతీయ విధ్వేషాలు తెస్తున్నారు. రాజధాని నిర్ణయించే హక్కులేని ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ మోసం చేస్తుంది.

విశాఖ నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయి. రుషికొండ కు ఒక చారిత్రిక గుర్తింపు ఉంది.రుషికొండను నేడు బోడిగుండును చేశారు. పర్యావరణం విషయంలో కోర్టులు చాలా గట్టిగా ఉంటాయి. విచారణ జరగుతున్నా కొండను కొట్టేస్తున్నారు. 72 శాతం పూర్తి అయిన పోలవరం ను ముంచేశారు.రాజధాని అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు…వీటితో రాష్ట్రానికి ఎంతో లబ్ది..అలాంటి ప్రాజెక్టులను నాశనం చేశారు. ఇది తప్పు అని అంటే పోలీసులను ఇంటికి పంపుతున్నారు. కడపలో పార్టీ నేత ప్రవీణ్ రెడ్డి ఇంటిపై దాడి చేసి ఆయన పైనే కేసు పెట్టారు. అంటే భయపడి మనం పారిపోవాలా….సమస్యే లేదు. రాష్ట్రం కోసం పోరాడుతాం.అడ్వకేట్లు నల్లకోటు అండగా ధైర్యంగా న్యాయం కోసం పోరాడాలి. రైతు బిడ్డ, కూలీల బిడ్డలు కూడా మంచి ఉద్యోగాలు చేయాలని ఐటిని తెచ్చాను.25 ఏళ్ల కంటే ముందు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి.

100 ఏళ్ల భారత స్వాతంత్ర వేడుకల నాటికి ఇండియా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటుంది. యంగ్ ఇండియా ద్వారా ఇది సాధ్యం అవుతుంది.మొన్న ఇంటర్వ్యూలో బాలకృష్ణ కూడా అన్నాడు….నాడు రాళ్లు రప్పలు ఉన్న ప్రాంతం ఇప్పుడు ఎలా మారిందో అని అన్నాడు. బాహుబలి సినిమా నాడే వచ్చి ఉంటే హైదరాబాద్ అభివృద్దిని కూడా నాడు గ్రాఫిక్స్ అనే వాళ్లేమో అని బాలకృష్ణ అన్నారు.

హైదరాబాద్ నా విజన్…..ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వైసిపి 420 విధానం రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉంది.కొద్ది రోజుల క్రితం 41 ఎ నోటీస్ లేకుండా అరెస్టు చేసేవాళ్లు…ఇప్పుడు పరిస్థితి మారింది.పోలీసులు తప్పు చేస్తే ప్రశ్నించే అవగాహన ప్రజలకు వచ్చింది. తప్పు చేస్తే న్యాయమూర్తులను కూడా వివరణ అడిగే పరిస్థితి వచ్చింది కాబట్టి మార్పు వచ్చింది.

ఫోన్ లో మెసేజ్ ను డిలీట్ చేస్తే కూడా కేసు పెడతారా.ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత న్యూస్ ఫార్వర్డ్ చేస్తే రాజద్రోహమా అడ్వకేట్లు తమ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యకర్తల కోసం సమయం పెట్టండి.మనమీద తప్పుడు కేసులు పెట్టిన వారిని కట్టడి చెయ్యాలి అంటే ప్రైవేటు కేసులు వేయాల్సిందే. ప్రతి నియోజకవర్గంలో అడ్వకేట్లు ఒక టీంగా ఏర్పడి అక్కడి కేసులపై గైడ్ చెయ్యాలి.

దీనికి అడ్వకేట్ల సహకారం కోరుతున్నాను. నేను కుప్పం పర్యటనకు వెళితే నా టూర్ కు వచ్చిన పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు.కార్యకర్తలను కేసులతో హింసించిన వారిని ఎవరినీ వదిలేదు నా జీవితంలో ఎప్పుడూ భయపడలేదు. నేను ఎదుర్కొన్నన్ని సంక్షోభాలు ఎవరూ ఎదుర్కోలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత అడ్వకేట్లకు మంచి అవకాశాలు కల్పిస్తాం.

Leave a Reply