ఈనాడు దినపత్రిక పై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరువు నష్ట నోటీసు

పోలీసులకు విశాఖపట్నం ఎంపీ ఫిర్యాదు

తన పరువుకు నష్టం కలిగించేలా కథనాలు రాసిన ఈనాడు పత్రికపై విశాఖ వైసీపీ ఎంపీసత్యనారాయణ పరువునష్టం నోటీసు ఇచ్చారు. దానితోపాటు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదు ఇదీ….
తేది 13.10.2022న ఈనాడు వార్తాపత్రికలో ప్రధాన పేజీలో మరియు ప్రధాన అనుబంధం యొక్క రెండవ పేజీలో ప్రచురించబడిన “ఎంపీ గారి దందా” శీర్షికతో వచ్చిన వార్తా కథనానికి సంబంధించి అందరి ప్రజానీకానికీ తెలియజేయునది ఏమనగా, సదరు ఈనాడు వార్తా పత్రికలో “ఎంపీ గారి దందా” శీర్షికతో వచ్చిన వార్త పూర్తీగా నిరాధారమైనది అని మరియు నా యొక్క పరువు మర్యాదలను భంగపరిచే విధంగా ఉన్న ఈ వార్తను పూర్తీగా ఖండిస్తున్నాని తెలియజేస్తూ, సదరు శీర్షికలో చెప్పిన ఎ.10.57సెం ల భూమి కి సంబంధించి ఈ దిగువ తెలిపిన విధంగా వాస్తవాలను మీ ముందు ఉంచుతున్నాము.

సదరు ఈనాడు వార్తా పత్రికలో “ఎంపీ గారి దందా” శీర్షికలో లో చెప్పిన ఎ.10.57సెం ల భూమి యొక్క వ్యాపార లావాదేవీలు 2012లో మొదలై భూ యజమానులతో అగ్రిమెంట్‌ 2018 జనవరి 8న జరిగింది. అప్పటికి నేను పార్లమెంటు సభ్యుడను కాదు. కనీసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడను కూడా కాదు. ఎందుకంటే నేను పార్టీలో చేరిందే 2018 మేలో. ఒక వ్యాపారిగా సదరు భూమికి చెందిన ప్రయివేటు వ్యక్తులందరితోనూ ఒప్పందాలు చేసుకుని, వివాదాన్ని పరిష్కరించుకుని నిర్మాణం మొదలుపెట్టాము. ఈ భవనానికి జీవీఎంసీ 2019 మార్చిలో అనుమతులిచ్చింది. కానీ ‘ఈనాడు’ ఈ విషయాలేమీ రాయలేదు.

వాస్తవాలు ఇవీ….!
1. కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాలకు సంబంధించి 1982 నుంచి దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. గొట్టిపల్లి శోభారాణి కుటుంబీకులు, 160 మంది డాక్‌ లేబర్‌ బోర్డు (డీఎల్‌బీ) ఉద్యోగులతో పాటు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ల మధ్య 1982 నుంచీ వివాదం ఉంది. వివాదాన్ని పరిష్కరించేలా చూడాలని బిల్డర్‌గా ఉన్న నన్ను 2012లో డీఎల్‌బీ ఉద్యోగులు ఆశ్రయించారు.
2. ఆ 160 మంది ఉద్యోగులకూ ఒక్కొక్కరికీ ఒక్కో ఫ్లాట్‌ చొప్పున మొత్తం 160 ఫ్లాట్లను ఇస్తానని ఎంవీవీ సత్యనారాయణ గారు చెప్పటంతో… వారు తమ వాటాను ఆయనకు 2012లోనే అగ్రిమెంట్‌ చేశారు.
3. ఆ తరవాత కొప్పిశెట్టి శ్రీనివాస్‌తో ఎంవీవీ సత్యనారాయణ గారు సంప్రదింపులు మొదల పెట్టారు. 2012లో మొదలైన ఈ ప్రక్రియ… చివరకు 2017లో ముగిసింది. వారికి 30వేల చదరపు అడుగులను ఇచ్చేలా 2017లో ఎంఓయు కుదిరింది.
4. ఇక మిగిలిన గొట్టిపల్లి శోభారాణి, ఆమె కుటుంబీకులకు 14,400 చదరపు అడుగులిచ్చేలా వారితో 2018 జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. ఇవన్నీ ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందాలు. వీటికి ప్రభుత్వంతో ఒక్క శాతం కూడా సంబంధం లేదు. ఈ ఒప్పందాలతో పాటు వివిధ పక్షాలకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు చెల్లింపులు కూడా చేశారు.
5. ఇవన్నీ పూర్తయ్యాక 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతులను నిర్మించుకునేందుకు 2019 మార్చి 11న జీవీఎంసీ ప్లాన్‌ను ఆమోదించింది.
6. అక్కడ ధర చదరపు అడుగు రూ.4 వేల మేర ఉన్నా… ఇందులో కొన్న సుమారు 1800 మందికి చ.అ. రూ.2,500కే ఇచ్చామని, గేటెడ్‌ కమ్యూనిటీ సదుపాయాలున్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాటు రూ.30 లక్షలలోపు ధరకే అందించామని, ఇదంతా పూర్తిగా ప్రైవేటు వ్యవహారం.
పై వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని, ఈనాడు వార్తా పత్రికలో ప్రచురితమైన వార్తలను వెంటనే తొలగించవలసిందిగా మరియు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారి యొక్క పరువు మర్యాదలను భంగపరిచే విధంగా ప్రవర్తించిన ఈనాడు గ్రూప్ ఛైర్మన్ శ్రీ చెరుకూరి రామోజీరావు గారికి అదేవిధంగా ఎడిటర్, ప్రింట్ మీడియా వారిపై చట్టబద్దమైన సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోబడునని తెలియజేస్తూ వారికి రిజిస్టర్డ్ పరువునష్టం నోటీసును ఇస్తూ పోలీస్ కంప్లైంటు ఇవ్వడం జరిగింది.
mp-complaint

ఇట్లు
విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు
శ్రీ ఎంవీవీ సత్యనారాయణ గారి కార్యాలయం

Leave a Reply