Suryaa.co.in

Andhra Pradesh

సైకో ఫేకూ జగన్ నాతో చర్చకు సిద్ధమా?

ఓపెన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి నారా లోకేష్

ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా మన అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానం గౌరవప్రదంగా ఉండాలని మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి @ncbn మాకు హితబోధ చేస్తూనే వుంటారు. నిజం వైపు నిలబడాలని టిడిపి కేడర్ నుంచి లీడర్ వరకూ దిశానిర్దేశం చేశారు. మన ప్రవర్తన భవిష్యత్ తరానికి ఆదర్శంగా ఉండాలని చెబుతారు.

YSRCP పునాది హింస, అసత్యాలపై నిర్మించబడింది. అబద్దాలకోరు వైఎస్ జగన్ రాజకీయ పార్టీ ముసుగులో నేర సామ్రాజ్యం నిర్మించాడు. వైసీపీ అధినాయ‌కుడై ఉండి ఆయ‌నే అబద్ధాలు మాట్లాడతాడు. త‌న పార్టీ నేత‌ల‌తో అబద్ధాలు మాట్లాడిస్తాడు. ఇవే అబ‌ద్ధాల‌ను త‌న మీడియా సంస్థ‌ల ద్వారా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తాడు. ఫేక్ చేయ‌డం, మార్ఫింగ్ చేసి తాను, త‌న పార్టీ, త‌న మ‌నుషుల ద్వారా విష‌ప్ర‌చారం చేయిస్తాడు @ysjagan.

@ysjagan ఆడిన అబ‌ద్ధాల వెనుక నిజాలు ప్ర‌జ‌ల ముందుంచుతున్నాను.

జ‌గ‌న్ అబద్ధం: కూట‌మి ప్ర‌భుత్వం దిశ చట్టాన్ని నిలిపేసింది.
నా జవాబు: దిశా చట్టం లేదు. అదంతా అబద్ధం. చట్టమే లేన‌ప్పుడు మేం ఎలా ఆపేస్తాం?

జ‌గ‌న్ అబద్ధం: 2014-24 మధ్య శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయి
నా జ‌వాబు: 2019-24 మధ్య జ‌గ‌న్ పాల‌నా కాలంలో 2027 మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఒక్క నిందితుడిపైనా దిశ చ‌ట్టం కింద విచారణ జరగలేదు. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు.

జ‌గ‌న్ అబద్ధం: ఎన్డీఏ ప్ర‌భుత్వంలో పోలీసులు శాంతిభ‌ద్ర‌త‌లు ప‌ట్టించుకోవ‌డంలేదు.
నా జవాబు: @ysjagan హ‌యాంలో ప్ర‌శ్నించే ప్ర‌జ‌లు, ప్రతిపక్షాలను హింసించ‌డానికి పోలీసు వ్య‌వ‌స్థ‌ని విచ్చ‌ల‌విడిగా వాడారు. నేర‌స్తుల‌ను ప‌ట్టుకోవ‌డానికి పోలీసు వ్య‌వ‌స్థ‌కి అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు, టెక్నాల‌జీ, మ్యాన్ ప‌వ‌ర్ కోసం ఒక్క రూపాయి విద‌ల్చ‌లేదు @ysjagan ప్ర‌భుత్వం. జ‌నం భ‌ద్ర‌త‌ని గాలికొదిలేసి జ‌గ‌న్ భ‌ద్ర‌త‌ కోసం తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ ఐరన్ కాంపౌండ్‌ను నిర్మించడానికి ప్ర‌భుత్వ నిధులు రూ.12.85 కోట్లు వెచ్చించారు. నేర‌స్తుల‌ను ప‌ట్టుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే సీసీ కెమెరాల‌కు ఒక్క రూపాయి ఇవ్వ‌లేదు. మ‌ర‌మ్మ‌తులు చేయించ‌లేదు.

ఎన్డీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో @ncbn గారు శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నేరాలు జ‌ర‌గ‌కుండా నిఘాకు, నేర‌స్తుల‌ను ప‌ట్టుకునేందుకు ఎంతో అవ‌స‌ర‌మైన సీసీ కెమెరాలు 13,000 పైగా నిధులు మంజూరు చేశారు.

నేరగాళ్లకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంటే, ఏపీలో మహిళలకు ఎన్డీయే ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలను దుర్భాషలాడేందుకు, దాడులు చేసేందుకు జగన్ తన నేరగాళ్లకు స్వేచ్ఛనిచ్చాడు. అందుకే మహిళలు జగన్‌ని అధికారం నుంచి దింపారనేది నిజం. మహిళలకు రక్షణ లేకుండా చేసిన జగన్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వ్యవస్థలను గాడిలో పెట్టి, మహిళలు సురక్షితంగా భావించే వాతావరణాన్ని కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. సొంత చెల్లెళ్ళను, తల్లిని హింసించే జగన్ ఆయన పార్టీకి మహిళలు సురక్షితంగా ఉండడం ఇష్టం లేదు. ఇది వైకాపా వాళ్ళ సంస్కృతి. @ysjagan అబద్ధం చెప్పకపోతే, పైన పేర్కొన్న అంశాలపై చర్చకు రావాలని నేను సవాలు విసురుతున్నాను. చర్చకు రాలేదంటే #సైకో ఫేకూ జగన్ అని తాను ఒప్పుకున్నట్టే..!

LEAVE A RESPONSE