Suryaa.co.in

Andhra Pradesh

నూతన ఆలయ పాలకమండలి కమిటీల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తాం

-దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

సచివాలయంలో బ్లాక్ నెంబర్ 2 రూమ్ నెంబర్ 137 లో గల తన చాంబర్ లో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తప్పులు చేసిన వాళ్లు అధికారుల ముందు ప్రజల ముందు సమాధానం చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగిన సరిచేసుకుంటూ ముందుకు పోవాలనేది మా శాఖ లక్ష్యం . కృష్ణా జల హారతులు పున ప్రారంభం అవుతాయి.

దేవదాయ శాఖకు 20,839 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే మతపరంగా 11,142 మంది పాలనాపరంగా 9,697 మంది ఈ శాఖలో పనిచేస్తూ ఉన్నారు. 1,237 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి. వీటిలో 462 ట్రస్ట్ బోర్డు కమిటీలను వేయవలసి ఉంది అని అన్నారు.

ఇవి ఎన్డీఏ కూటమి నిర్ణయం మేరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఆలోచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం. మొత్తం ఈ శాఖలో ఉన్న ఆలయాల సంఖ్య 27 వేల 105 ఆలయాలు ఉన్నాయి. అందులో వివిధ గ్రేడ్లు ఉన్నాయి 6A ఆలయాలు 236 ఉన్నాయి రెండు కోట్ల పైబడి ఆదాయం ఉన్న దేవాలయాలు 6A కిందకి వస్తాయి వీటికి దేవాదాయ శాఖ కమిషనర్ ఉంటారు అని అన్నారు.

LEAVE A RESPONSE